(దండుగుల శ్రీనివాస్)
వచ్చీ రాగానే టాలీవుడ్‌పై పడ్డాడు రేవంత్‌రెడ్డి. మొదటగా బలిపెట్టింది నాగార్జునను. వివాదరహితుడిగా తన పని తాను చేసుకుపోయే తత్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాటలో సినిమానే ప్రపంచంగా బతికినవాడు. బతుకుతున్నవాడు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న అందరితో కలుపుగోలుగా ఉండేవాడు కూడా. కానీ ఎందుకో రేవంత్ నాగార్జునను టార్గెట్ చేశాడు.
హైడ్రా వచ్చీ రాగానే ఎన్-కన్వెన్షన్‌ను కూల్చేసింది. అది కింగ్ ఊహించని పరిణామం. ఇది పక్కా కక్షపూరిత చర్యే అందులో డౌట్‌లేదు. తన బిడ్డె పెండ్లికి ఫ్రీగా ఎన్-కన్‌వెన్షన్ ఇవ్వలేదని, ఇంకేదో కారణాలు ప్రచారం చేసినా.. నాగార్జున కోట్లాది రూపాయల ఆస్తి.. పరువు మాత్రం హైడ్రాలో కలిసిపోయింది. ఇది చాలదంటూ నోటి దురుసు మంత్రి కొండా సురేఖ చేసిన వల్గర్ కామెంట్లు అక్కినేని కుటుంబాన్ని తీవ్రంగా అవమానించాయి.
కానీ పీసీసీ చీఫ్, సీఎం.. మంత్రి కొండాకే మద్దతు పలికారు. ఆమెకు బాసటగా నిలిచారు. తప్పని సరి పరిస్థితుల్లో నాగార్జున కోట్లు మెక్కాల్సి వచ్చింది. అంతలా గ్యాప్ పెంచుకోవడానికి వెనుకాడని సీఎంతో ఇవాళ నాగ్ కలిశాడు. అన్నీ పక్కన పెట్టాడు. సినీ ఇండస్ట్రీ పెద్దల్లో ఒకడిగా తనవంతుగా వచ్చి సీఎంను సన్మానం చేశాడు. సీఎం స్థాయిని తక్కువ చేసి చూసే ఉద్దేశం నాగ్‌కు కానీ, అల్లు అర్వింద్‌కు కానీ లేవు. కానీ రేవంతే ఇన్విరియారిటీ కాంప్లెక్స్‌తో మరీ ఎక్కువ ఊహించుకున్నాడు. కక్ష పెంచుకున్నాడు. అప్పడు నాగ్ విషయంలో చాలా దురుసుగా, కఠినంగా, కక్షపూరితంగా వ్యవహరించాడు. కానీ అవేవీ మనసులో పెట్టుకోలేదు నాగ్. చాలా హుందాగా నడుచుకున్నాడు.
అదే చిరునవ్వు. కోట్ల రూపాయల ఆస్తుల కన్నా మంచి రిలేషనే ఎంతో మేలు అని నమ్మే తన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడు నాగార్జున. అదే చేసి చూపాడీవేళ.