(దండుగుల శ్రీనివాస్)
ఈ కొత్త ఏడాదిలో కొత్త పథకాలకు అంకురార్పణ జరుగుతున్నది. చబ్బీస్ జనవరి నుంచి డబుల్ ధమాకాగా రైతులకు, పేదలకు పథకాలు వర్తించనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రాళ్లు రప్పలు, రోడ్లు, రియల్ వెంచర్ భూములు, భూసేకరణ జరిగిన వాటిని వదిలి వ్యవసాయ యోగ్యమైన అన్నిభూములకు ఏడాదికి 12వేల రూపాయలు ఇస్తామన్నాడు రేవంత్.
అంతే కాకుండా వ్యవసాయభూములు లేని కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12వేలు ఇస్తామంటున్నాడు. ఈ రెండు పథకాలు జనవరి 26 నుంచి అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు.. రేషన్‌కార్డులు కూడా జారీ చేస్తామన్నాడు. మంత్రివర్గ సమావేశంలో కీలకమైన ఈ మూడు విషయాలపై సుధీర్ఘంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నాడు రేవంత్. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వస్తుంది…? ఐదా పదా..? ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదా..?
ఇలా ఎన్నో రకాల ఊహాగానాల నేపథ్యంలోఆయన ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు. అందరికీ రైతు భరోసా వర్తిస్తుంది. కానీ…ఆ భూములన్నీ వ్యవసాయ యోగ్యమై ఉండాలనే కండీషనే ప్రధానంగా పెట్టారు. అంతే. ఇక మిగిలన వాటికి ఇవ్వబోమన్నారు.