Category: State News

కళాతపస్వి కన్నుమూసినా టీన్యూస్‌కు కనిపించదు… రుద్రాక్ష యాడ్‌ కావాలి… అన్నీ చానళ్లు ఒకదారి మన టీన్యూస్‌ ది మరోదారి… అంతే మరి మేం మారం…!!

కళాతపస్వి… ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ కన్నుమూశాడనే వార్త పొద్దుపొద్దునే అందరినీ కలిచివేసింది. సోషల్‌ మీడియాతో పాటు అన్నీ చానళ్లలో ఇదే వార్త. ఆయన తెలుగు సినీలోకానికి చేసిన సేవ, దర్శకత్వం వహించిన సినిమాలు, అవార్డులు, రివార్డులు.. ఆయన జీవిత చరిత్ర అన్నింటినీ…

తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచెయ్యి… సబ్‌ కా సాత్‌ కాదు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలే లక్ష్యం…. నిజామాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాల ఏర్పాటు ఇక కలగానే మిగిలిపోవాలా..? ఈ ఏడాది తర్వాత ప్రభుత్వం వెళ్లిపోతున్నదని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత

తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని…

తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల పట్ల సీఎం కేసీఆర్‌ ప్రవర్తించిన తీరు పచ్చిద్రోహం…ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం… ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన

మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ…

సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి బంపర్‌ బోనాంజా…. ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ…11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం.. రూ.165.46 కోట్ల రాబడి…గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనం…. టీఎస్‌ ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌..

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,…

సభ మోస్తారు… ఫలితం బేజారు.. ఓ తొలి ప్రయత్నం అంతే…! ఇది సరిపోదు.. కేసీఆర్ స్పీచ్‌పైనా పెదవి విరుపు…

ఆపరేషన్ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌… అచ్చంగా ఖమ్మం సభకు ఇది సరిపోతుంది. బీఆరెస్‌ ఏర్పాటు తర్వాత పెట్టిన తొలి భారీ బహిరంగ సభ. జాతీయ నాయకులను రప్పించడంలో పర్వాలేదనిపించారు. కానీ సభే మోస్తారుగా.. సోసోగా సాగింది. కేసీఆర్‌ స్పీచ్‌ పై సర్వత్రా…

కేసీఆర్‌ మెప్పు కోసం ఇంతగా తండ్లాడాలా… అది జర్నలిస్టుల మీటింగులా లేదు.. అచ్చు బీఆరెస్‌ మీటింగులాగే సాగింది… ఓ జర్నలిస్టు మనోగతమిది….

జర్నలిస్ట్.. అంటే నిజాయితీగా పక్ష పాతం లేకుండా వార్త కథనాలు ఇచ్చే కలం వీరుడు. ప్రాణపాయం ఉందని తెలిసినా వార్త కథనం కోసం ప్రజల వైపు నిలిసే నిఖార్సయిన జర్నలిస్ట్.. కానీ.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వేన్షన్…

ఇంటి కోసం మూడు లక్షలు.. వలస జనం హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు… సొంతూళ్లకు రప్పిస్తున్న సర్కారు సొంతింటి నిర్మాణ పథకం…

వాళ్లంతా పొట్ట చేతబట్టుకొని భాగ్యనగరానికి వచ్చినవారు. కడుపు తిప్పల కోసం ఉన్న ఊళ్లో ఉపాధి లేక రాజధాని బాట పట్టిన వాళ్లు. ఇక్కడ కిరాయిలు కట్టలేక, పెద్దగా ఆదాయం లేకపోయినా.. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో కాపురాలు చేస్తూ ఆలుమగలు కంపెనీలలో జీతగాళ్లుగా,…

వినాయకచవితి చందా ఇవ్వకపోతే.. దేవుళ్లను నమ్మను అన్నందుకు…గుంపులు గుంపులుగా వెళ్లి ఒక వ్యక్తి చేత క్షమాపణ చెప్పించడం ఒక విజయమా!

#ఆగస్టు వినాయకచవితి_చందా…. స్కూలుకి చందాకి వెళ్లి సార్ చందా అని అడిగారు #సార్: నేను ఇవ్వను అన్నాడు #వచ్చిన_బ్యాచ్: ఎందుకు ఇవ్వరు #సార్: నేను దేవుని నమ్మను కాబట్టి దేవుళ్ళ కోసం నేను ఇవ్వను #వ.బ్యా.: ఎందుకు నమ్మరు, సరస్వతిని నమ్మరా…

కవిత పుత్రోత్సాహం… తన కొడుకు పాఠశాలను సందర్శించి… ప్రాజెక్టు వర్క్‌ను ఆసక్తిగా తిలకించి…ఓ సాధారణ మహిళగా… ఓ మాతృమూర్తిగా… తన కొడుకూ వేసిన ప్రాజెక్టు వర్క్‌ను ఆసక్తిగా తిలకించి..

ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో బిజీ బిజీ.. ఎప్పుడూ జనం మధ్యే. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లిన జన సందోహమే. ఇంత బిజీలో ఉండి కూడా ఆమె ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్‌ మరవలేదు. బాధ్యతనూ విడవలేదు. తన పుత్రుడు చదువు ఎలా ఉందో…

కేసీఆర్‌ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే… మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ సందర్భంగా మరోసారి కేసీఆర్‌ నోట జర్నలిస్టుల మాట.

తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్‌ అంటే కోపముంది. హైదరాబాద్‌ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా……