దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇందూరుకు ఇదో శాపం. అధికార పార్టీ ఒకటైతే గెలిచే ఎంపీ క్యాండిడేట్‌ మరొకరు. దీంతో పరస్పర మాటలు, అభివృద్ధి విరుద్ధ చేష్టలే తప్ప ఎంపీగా గెలిచిన అర్వింద్‌ ఏమీ చేయలేకపోయాడు. కేసీఆర్‌ తన కూతరు కవితను ఓడగొట్టినందుకు జిల్లాపైనే కినుక వహించాడు. ఇక్కడికి రావడానికే ఆయన మనసొప్పలేదు. చాలా గ్యాప్‌ తరువాత గానీ ఆయన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ భవన ప్రారంభోత్సవానికి వచ్చాడు తప్ప పెద్దగా జిల్లా పై ఇంట్రస్ట్ పెట్టలేదు. సేమ్‌ అదే తరహాలో వార్నింగ్‌ ఇచ్చాడు ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి.

ఇవాళ గాంధీభవన్‌లో నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశాడు రేవంత్‌. కీలక నేతలకు మాత్రమే ఆహ్వానం అందింది. వీరితో ఎక్కువ సేపు మాట్లాడకపోయినా.. సూటిగా సుత్తిలేకుండా ఉన్న విషయం చెప్పి పంపాడు రేవంత్‌. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించి తీరాలని కచ్చితమైన ఆదేశాలిచ్చాడు సీఎం.

‘మన క్యాండిడేట్‌ ఓడిపోతే మీకు నా దగ్గరకు వచ్చేందుకు ముఖాలుండవు. నేను ఢిల్లీలో ముఖం చూపట్టెలేను. ఎవరికి వారు తామే అభ్యర్థిగా భావించి ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచేలా కష్టపడాలి. అప్పుడే మీకు వ్యాల్యూ ఉండేది..’ అంటూ కట్టె వరిచినట్టు, కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీద చెప్పేసి పంపాడు. శనివారం జిల్లాలో నియోజకవర్గ ముఖ్యనేతలందరితో కలిసి మళ్లీ మీటింగు పెట్టుకోవాలని కూడా సూచించాడు సీఎం.

You missed