Tag: ts govt

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకే… క‌రీంన‌గ‌ర్‌ను లిస్టులో చేర్చ‌ని ప్ర‌భుత్వం.. నిర్మ‌ల్‌కు ఓకే…

బీడీ క‌టాఫ్ డేట్ నిబంధ‌న‌ను ఎత్తివేసిన ప్ర‌భుత్వం .. దీన్ని కేవ‌లం నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకే ప‌రిమితం చేసింది. వాస్త‌వంగా బీడీ కార్మికులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో కొంత మేర ఉన్నారు. వీరంద‌రికీ ఇది వ‌ర్తించాలి.…

సెప్టెంబ‌ర్ 17…. వార్‌. టీఆరెస్‌, ఎంఐఎం ను కింద‌కు దించిన బీజేపీ….. తొలిసారి నిజాంది నిరంకుశ పాల‌న అని ఒప్పుకున్న ఓవైసీ…. జాతీయ స‌మైక్య‌త దినంగా పాటించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం.. బీజేపీ పావుల‌కు క‌దులుతున్న డొంక‌……

సెప్టెంబ‌ర్ 17. విలీన‌మా..? విద్రోహ‌మా..? విమోచ‌నా..?? ఇదెప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. ఒక్కొక్క‌రు ఒక్కోలా దీన్ని అభివ‌ర్ణించుకుంటారు. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి. కానీ బీజేపీ తొలిసారిగా ఈ తేదీని విమోచ‌న దినంగా అధికారికంగా నిర్వ‌హించాల‌ని యోచించ‌డం.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయ‌డంతో టీఆరెస్‌,…

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేత.. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌… ఇక‌పై జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే చికిత్స‌లు….

కుటుంబ‌ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది.…

జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలా…? అవునా…? నిజ‌మా…? న‌మ్మెదెవ‌రు…? ఇచ్చేదెవ‌రు…?? పైస‌లు క‌ట్టిన వాటికే దిక్కు లేదు…….. ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం కోల్పోయిన జ‌ర్న‌లిస్టులు….

త్వ‌ర‌లో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలిస్తామ‌ని ప్ర‌క‌టించాడు అల్లం నారాయ‌ణ‌. పాపం ఆయ‌న అంత‌కు మించి ఏం చేస్తాడు. ఏదో చెప్పాలి ఆ సీట్లో కూర్చ‌కున్నంక‌. ఇంకో రెండేండ్లు పెంచారు. అప్ప‌టి వ‌ర‌కు ఇలా ఏదో చెబుతూ కాలం వెళ్ల‌దీయాల్సిందే. కానీ ఇళ్ల…

ఖ‌జానా లో కాసుల్లేక‌….జీతాలే కాదు… ఆస‌రా పింఛ‌న్లూ ఇక మ‌రింత ఆల‌స్యం…. ఇక విడ‌త‌ల వారీగా జిల్లాల‌కు విడుద‌ల‌…

ఖ‌జానా ఖాళీ అయ్యింది. నెల నెలా జీతాలు కూడా టంచ‌న్‌గా ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇది చాలా రోజులుగా ఉంది. ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతూనే ఉంది గానీ మెరుగు ప‌డ‌టం లేదు. ప్ర‌తీనెలా ఉద్యోగుల జీతాలు విడ‌త‌ల వారీగా జిల్లాల‌కు విడుద‌ల చేస్తున్నారు.…

తెలంగాణ‌లో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు వెట్టిచాకిరీ జీత‌గాళ్ల క‌న్నా, బాండెడ్ లేబ‌ర్ క‌న్నా అధ్వాన్న‌మైన జీవితాలు గ‌డుపుతున్నారు….. ఎవ‌రిని నిందించాలి…

ఎవరిని నిందించాలి? మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా…

అంగ‌ట్లో అక్రిడేష‌న్లు.. ముప్పై న‌ల‌భైవేలిస్తే ఒక అక్రిడేష‌న్‌… ఆల‌సించినా ఆశాభంగం… త్వ‌ర‌ప‌డండి…

అక్రిడేష‌న్‌. ఓ జ‌ర్న‌లిస్టుగా అదో గుర్తింపు కార్డు. అదుంటే ఇక అన్నీ మ‌న చేతిలో ఉన్న‌ట్టే అని భ్ర‌మ‌ప‌డ‌తారు. ఏదైనా చేసేయొచ్చ‌ని వెర్రి క‌ల‌లు కంటారు. త‌మ చేతిలో అదో ప‌శుప‌తాస్త్రం అని చంక‌లు గుద్దుకుంటారు. అందుకోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఎంతైనా…

స‌ర్కారు బ‌డుల ప‌రిస్థితి మ‌రీ ఇంత అధ్వాన‌మా..? ఉపాధ్యాయుల జీవితంలో ఎన్నడూ ఇంత మానసిక క్షోభ అనుభవించలేద‌ట‌…..

నేటి నుంచి బ‌డులు తెరుచుకుంటున్నాయి. స‌ర్కారు బ‌డుల ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. గ‌తంలో క‌న్నా మ‌రీ దారుణంగా ప‌రిస్ఙ‌తులు త‌యార‌య్యాయ‌ని పేరు తెలియ‌ని ఓ ఉపాధ్యాయుడు రాసిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.…

కొత్త పింఛ‌న్ల కోసం మూడేండ్ల నుంచి మూడు ల‌క్ష‌ల మంది ఎదురుచూపులు….

తెలంగాణ స‌ర్కార్ ఇచ్చే ఆస‌రా పింఛ‌న్లు వాస్త‌వంగా చాలా కుటుంబాల‌కు ఆస‌రాగా ఉంటున్నాయి. వృద్దాప్య, వితంతు పింఛ‌న్లు వారిని ఆదుకుంటున్నాయి. కొత్తగా పింఛ‌న్‌కు అర్హ‌త ఉండి.. ద‌ర‌ఖాస్తు చేసుకుని క‌లెక్ట‌ర్ల ఆమోదం పొంది స‌ర్కార్ వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న పింఛ‌న్‌దారుల సంఖ్య…

లే అవుట్ డెవ‌ల‌పర్ల‌కు మ‌ళ్లీ షాక్‌.. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమ‌తి లేని మొదటి ప్లాట్ల‌కు నో రిజిస్ట్రేష‌న్

లే అవుట్ డెవ‌ల‌ప‌ర్ల‌కు మ‌ళ్లీ షాక్ త‌గిలింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమ‌తి లేకుండా ప్లాట్లు విక్ర‌యించ‌రాద‌ని ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేర‌కు రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు ఇవాళ ఉత్త‌ర్వులు అందాయి. గ‌తంలో గ్రామ పంచాయ‌తీల అనుమ‌తిలో లే అవుట్…