Tag: #cmrevanthreddy. #

అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్‌…! బీజేపీ నెత్తిన పాలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షాన్ని నిలువునా పాత‌రేద్దాం అనే ఆలోచ‌న‌… ఆ పార్టీనే స‌మాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిల‌దీసే శ‌క్తి కాన‌రావొద్దు. ప్ర‌శ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాత‌రేయాలి. ఆ త‌రువాత మ‌న‌మేం అవుతాం.. మ‌న‌కేం పాఠం చెబుతారు..? అనేది…

ఎల‌క్ష‌న్స్ చాలా కాస్ట్లీ గురూ…! పైస‌ల‌కే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ…!! ఎక్కువ డ‌బ్బిచ్చిన వారికే జై కొట్టిన విద్యావంతులు…. ఒక్క ఎమ్మెల్సీ కోసం రూ. 35 కోట్లు ఖ‌ర్చు….! ఇంత‌లా ఖ‌ర్చు ఇదే తొలిసారి… ! ఎమ్మెల్సీ కుర్చీ ఖ‌రీదు పెరిగింది…మ‌రి ఎమ్మెల్యే కుర్చీకెంత‌….?? బీసీ నినాదం ఓ చోట నిలిచింది… మ‌రో చోట ఓడింది…!! బీజేపీకి లాభించింది…. కాంగ్రెస్‌ను ముంచింది….!! బీఆరెస్ పోటీలో లేక‌పోవ‌డం బీజేపికి క‌లిసివ‌చ్చింది..!

Dandugula Srinivas తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఖ‌ర్చు పెరిగింది. మామూలుగా కాదు. విప‌రీతంగా. ఎమ్మెల్యే గెలుపు కోసం యాభై కోట్లు దాటి వంద కోట్ల‌కు చేరువైన నేప‌థ్యాన్ని చూశాం. ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్సీ కోసం కూడా రూ. 35 కోట్ల‌కు మించి ఖ‌ర్చు…

స‌ద‌వుకున్న స‌న్నాసులు ఎవ‌రి కొంప ముంచుతారో…!

Dandugula Srinivas వాళ్లంతా స‌దువుకున్న స‌న్నాసులు. డిగ్రీ ప‌ట్టా పుచుకున్న పాగ‌ల్‌గాళ్లు. ఓటెయ్యాల్నో ఇంకా తెలుసుకోని బ‌చ్చాగాళ్లు. అంగోఠి నిషానీ గాళ్ల‌క‌న్నా బేకార్‌గాళ్లు. అవును ఇట్ల‌నే తిట్టుకుంటున్న‌రంతా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చెల్ల‌ని ఓట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా పోగ‌యిన‌యంట‌. వేల‌కొద్ది. పోలైన‌వి…

సీఎం మారుతున్నాడు…! మారుతున్నాడు…!! మారుతున్నాడు…!!! చేసిందేమీ లేదు… తెచ్చిందేమీ లేదు…!! రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రోల్ ఇదే.. !!

Dandugula Srinivas బీజేపీ రోల్ ఇది. చెప్పేందుకేం లేదు. చేసిందీ మ‌రేం లేదు. ఏం చేయాలి మ‌రి. ఏదో ఒక విధంగా వార్త‌ల్లో ఉండాలె. వైర‌ల్ కావాలె. ఆల్ట‌ర్నేట్ పార్టీ మేమే అని జ‌నాలు న‌మ్మాలి. రేపు ప్ర‌భుత్వం ఏర్ప‌డేది మాదే…

సీఎం నేనే ఉంటా… ముందు.. మున్ముందు…! ఇక మీ బ‌తుకులు బ‌స్టాండే…!! కేసీఆర్‌, కేటీఆర్‌, బండి, కిష‌న్‌రెడ్డిల‌కు రేవంత్ వార్నింగ్‌… పాల‌మూరోళ్లంటే అల్లాట‌ప్పాకాదు.. నా గురించి మీకు తెల్వ‌దు…! రోజుకు 24 గంట‌లు ప‌నిచేస్తున్నా… నాపై బండ‌రాళ్లేసేందుకు మీరు చేస్తున్నారు..!! క‌డుపునిండా కుళ్లే… నేనేప్పుడు సీఎం అవుతానో అని క‌ల‌లు కంటున్న కిష‌న్‌రెడ్డి…!! గాంధీ, నెహ్రూ ప‌క్క‌న నీ బొమ్మ ఉండాలె… ఆ పోలీస్ స్టేష‌న్ల‌ల్ల మా ఫోటోలుండాలె..!! రేవంత్‌కు మంచి స‌ల‌హాదారుడు కావ‌లెను…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌రో మూడు నాలుగు ట‌ర్ములు.. అంటే ప‌దిహేను, ఇర‌వై ఏండ్ల పాటు త‌నే సీఎంగా ఉంటే బీఆరెస్‌, బీజేపీ బ‌తుకులు బ‌స్టాండ్ కాక‌త‌ప్ప‌ద‌ని ఆ పార్టీల నేత‌లు భ‌య‌పడుతున్నార‌ని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాల‌న‌లోనే త‌న‌ను త‌ట్టుకోలేక‌పోతున్నకేసీఆర్‌,…

ఇదేం దిక్కుమాలిన కౌంట‌ర్ రేవంత్‌….? ఆ హ‌రీషూ…నువ్వూ ఒక్క‌టేనా…?? నీకు స‌ల‌హాలిస్తుందెవ‌రో చెప్పు.. ఓ దండం పెట్టాలి…!

(Dandugula Srinivas) ఇది సీఎంవో ప్రెస్‌నోట్‌. ఏం ఉంది అందులో. కింద చ‌ద‌వండి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ నన్ను ఎన్నికల ప్రచారానికి వెళుతున్నాడని విమర్శిస్తున్న హరీష్ రావు….టన్నెల్ లో ప్రమాదం జరిగినప్పుడు దుబాయ్ లో దావత్ చేసుకోలేదా…

గీ ప‌ని గ‌ప్పుడే జేస్తే మంచిగుండె సారూ..!

(Dandugula Srinivas) గింత ఆలిశ్య‌మా..! గిదేదో గ‌ప్పుడే జేసేస్తే ఆ పాపం కొంచెం త‌గ్గేది గ‌దా సారూ..! గాళ్లు ఆ సొరంగంల ప‌డి స‌చ్చిండ్రా బ‌తికిండ్రా కూడా తెల్వ‌క చానామంది ప‌రేషాన్న‌యిండ్రు సారు. ఒక్క‌సారి నువ్వు పోయి ఆడ ప‌రిస్థితులు జూస్తే…

మోడీ మంచోడే…! కిష‌న్‌రెడ్డే క‌డ్డూ…!!

(Dandugula Srinivas) మోడీ మంచోడ‌ని కితాబిచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న‌కు తెలంగాణ కోసం ఏదేదో చేయాల‌ని ఉంటుంద‌ట‌. కానీ మ‌న కిష‌న్‌రెడ్డే అన్నింటికి అడ్డు త‌గులుతున్నాడ‌ట‌. కిష‌న్‌రెడ్డి ఏనాడైనా స్వ‌యంగా వెళ్లి మా తెలంగాణ‌కు ఇది కావాలె.. అది కావాలె…

బండి సంజ‌య్‌… ఓ గుండు..! కిష‌న్‌రెడ్డి.. ఓ అర‌గుండు…!! మోడీ… ఓ బ్ర‌హ్మానందం…!!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బండి సంజ‌య్‌ను గుండుతో పోల్చాడు. కిష‌న్‌రెడ్డిని అర‌గుండుతో… ఏకంగా పీఎం మోడీని క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందంతో పోల్చాడు. ఎవ‌రో కాదు. సీఎం రేవంత్‌రెడ్డి. తిట్టుకోవ‌డంలో, పోలిక‌లు పెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంలో, ఆరోప‌ణ‌లు గుప్పించుకోవ‌డంలో రాష్ట్ర నేత‌లు రోజు రోజుకు ఎదిగిపోతున్నారు.…

నేను పాల‌మూరు సీఎంను…! పాల‌మూరుకు సీఎంను…!! మీ రేవంత్ రెడ్డిని….. మాట్లాడుతున్నాను…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌ళ్లీ పాత పాటే. ప‌క్కా లోక‌ల్ స్పీచ్‌. సీఎం రాష్ట్రానికి కాదు. పాల‌మూరుకే అన్న‌ట్టుగా. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ క‌లిసి గెలిపిస్తే కాకుండా… పాల‌మూరు వాళ్ల‌తోనే తాను సీఎం అయిన‌ట్టుగా. గ‌ల్లీ లెవ‌ల్ స్పీచ్ మ‌ళ్లీ. త‌నను దిగిపోమంటున్నార‌ని. మీరే…