(Dandugula Srinivas)
మోడీ మంచోడని కితాబిచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణ కోసం ఏదేదో చేయాలని ఉంటుందట. కానీ మన కిషన్‌రెడ్డే అన్నింటికి అడ్డు తగులుతున్నాడట. కిషన్‌రెడ్డి ఏనాడైనా స్వయంగా వెళ్లి మా తెలంగాణకు ఇది కావాలె.. అది కావాలె అని అడిగాడట. ఉహూ అస్సలు లేదు.
కానీ ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా అడగగానే ఆయన చేస్తాననే సమయానికి టక్కున కిషన్‌రెడ్డి వెళ్లి వద్దు సార్ .. ఆ క్రెడిట్ మనకు రాదు.. రేవంత్‌కు వస్తది.. అని ఆపేస్తాడట. కాళ్లళ్ల కట్టె పెడతాడట. కిషన్‌రెడ్డి కడుపు నిండా కుళ్లేనట. గా బచ్చా రేవంత్ సీఎం అయ్యాడు. నేనే గిట్లనే ఉండవడితిని అని బాగా కుళ్లుకుని కుళ్లుకుని చస్తున్నాడట… ఇవన్నీ మన సీఎంగానే సెలవిచ్చారు మరి.