(Dandugula Srinivas)
ఇది సీఎంవో ప్రెస్‌నోట్. ఏం ఉంది అందులో. కింద చదవండి
హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
నన్ను ఎన్నికల ప్రచారానికి వెళుతున్నాడని విమర్శిస్తున్న హరీష్ రావు….టన్నెల్ లో ప్రమాదం జరిగినప్పుడు దుబాయ్ లో దావత్ చేసుకోలేదా ?
హరీష్ రావు పాస్ పోర్టును ఒకసారి బయట పెట్టమనండి
కాదు అంటే ఆ వివరాలను నేను బయటపెడతా
ప్రమాదం తర్వాత రెండు రోజులు అబుదాబిలో దావత్ లో హరీష్ రావు మునిగి తేలాడు….
…………………………………………………………….
ఎల్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాద సమయంలో హరీశ్ ఎక్కడుంటే నీకెందుకు రేవంత్… సర్కార్ చేపట్టాల్సిన చర్యలు సరిగ్గా చేస్తే సరిపోతది కదా. జనాలకు జవాబుదారీగా ఉండాలె కానీ… హరీశ్ ఏదో అన్నాడని, అతన్ని ఇరుకున పెట్టేందుకు ఆ రోజు నువ్వేడున్నావో తెల్వదా… బయటపెట్టాల్నా ..? అని దబాయింపు కౌంటర్‌తో మరింత మన స్థాయి తగ్గించుకోవడమే తప్ప వేరొకటి కాదు. వాళ్లు స్కెచ్ వేస్తారు. నువ్విలా ఆ ఉచ్చులో పడతావు. అప్పుడు రుణమాఫీ విషయంలో కూడా హరీశ్ రెచ్చగొట్టాడు. పంద్రాగస్టు డెడ్‌లైన్ పెట్టుకుని పీకల మీదకు తెచ్చుకున్నావు. ఆ హరీశును అలా వదిలెయ్. మనకెందుకు చెప్పు వారి గోల.
ఓవైపు హరీశు, ఓ వైపు కేటీయారు, మరోవైపు కవిత…. ఎవరికి వారే తమ రాజకీయ ఉనికి కోసం జనాల మధ్య ఉండేందుకు తండ్లాడుతున్నారు. జనానికి ఏం కావాలో అది చూడండి చాలు. ప్రతీ మాటకు కౌంటర్ ఇస్తానంటే.. అదీ ఇలాంటి దిక్కుమాలిన, పేలవమైన, చిన్నపిల్లాడి సవాలు మాదిరి కౌంటర్ ఇస్తే మరీ పలుచనైపోమూ. ముందా అడ్వైజర్ ఎవరో చెప్పు. వారికో దండం పెట్టాలి.
