(Dandugula Srinivas)
గింత ఆలిశ్యమా..! గిదేదో గప్పుడే జేసేస్తే ఆ పాపం కొంచెం తగ్గేది గదా సారూ..! గాళ్లు ఆ సొరంగంల పడి సచ్చిండ్రా బతికిండ్రా కూడా తెల్వక చానామంది పరేషాన్నయిండ్రు సారు. ఒక్కసారి నువ్వు పోయి ఆడ పరిస్థితులు జూస్తే మరింత జెల్దిన పనులు జరిగేయనే మాత్రం అంతా అనుకున్నరు సారు. కానీ మీరేమో గా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రయ్యున హెలికేప్టరేసుకుని తిరిగిండ్రుకానీ. గిటేపు ఓ సారి కూడా చూడకపోతిరి.
ఇంతలోనే మన మంతిరి గారు తిమ్మిరి తిమ్మిరి చేష్టలతో సర్కార్‌కు మరింత చెడ్డపేరు తెచ్చిపెట్టిండు. ఆళ్లు సచ్చిండ్రనే మాట చెవిన పడగానే నిజం చెప్పొద్దు.. అంతా బాధపడ్డరు. ఆళ్లంతా ఇక్కడోళ్లు కాకపోవచ్చు. గానీ మనుషులే గదా. పాణాలే గదా. ఇగ రాజకీయాల జోలెందుగ్గని. గా కేసీఆర్ పోయిండగప్పుడు కొండగట్టుల సచ్చినప్పుడు. అనొచ్చు. కానీ. ఇప్పుడది కాదు ముచ్చట. గాళ్లు చేసిండ్రని మనం జేస్తే తేడా లేదుగానే. మరి నీకెవలిస్తున్నరో సలహాలు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టే ఉంటున్నయ్…!