Dandugula Srinivas
తెలంగాణలో ఎన్నికల ఖర్చు పెరిగింది. మామూలుగా కాదు. విపరీతంగా. ఎమ్మెల్యే గెలుపు కోసం యాభై కోట్లు దాటి వంద కోట్లకు చేరువైన నేపథ్యాన్ని చూశాం. ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్సీ కోసం కూడా రూ. 35 కోట్లకు మించి ఖర్చు చేసిన ఉదంతం కళ్లముందే ఉంది. రోజు రోజుకుఈ ఖర్చును పెంచుతూ పోతున్నారు నాయకులు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ప్రవాహం కొనసాగింది. గ్రాడ్యుయేట్, టీచర్స్ … పోటీలు పడి ఖర్చు చేశారు. విద్యావంతులైన ఓటర్లు కూడా నిజాయితీగానే ప్రవర్తించారు. అదే… ఎక్కువ డబ్చిచ్చిన వారికే ఫస్ట ప్రయార్టీ ఓటేశారు న్యాయంగా. ఆ తరువాత కొంత తగ్గించి డబ్బిచ్చిన వారికి రెండో ప్రయార్టీ. ఇలా కొనసాగాయి ఈ ఎన్నికలు.
మొత్తానికి ఈ పర్యవసానమంతా భవిష్యత్ లో తెలంగాణ ఎన్నికలు మరింత కాస్ట్లీ గురూ అనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. కేసీఆర్ ఆజ్యం పోశాడు. మిగిలిన వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇలా. ఇక పరంపరకు బ్రేకులు లేవు. స్టాపులు లేవు. స్పీడుగా శరవేగంగా ముందుకు దూసుకుపోతూనే ఉంటుంది. కులాలు, పార్టీలు సెకండరీ. మొదట క్యాండిడేట్‌కు కావాల్సింది డబ్బే. ఎంత ఖర్చు పెడతాడు. ప్రత్యర్థిని మించి ఎంత ఎక్కువ ఖర్చు చేయగలడు. ఓటుకు ఎంతివ్వగలడు. ఎంత వరకు పెంచుతూ పోగలడు. జనాన్ని నోట్లతో ఎలా కప్పేయగలడు. ఇవే ప్రయార్టీలు. డబ్బే కొలమానం. అంతే. అది మనకు తెలంగాణ జాతిపిత నేర్పిన పాఠం. దీన్ని ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా అవలర్చుకుని అందిపుచ్చుకుంటున్నాయి.
ఇక మనమే రోల్ మాడల్‌గా నిలవనున్నాం. దేశానికే ఆదర్శంక కానున్నాం. దేనికంటారా..? అదే.. ఎన్నికల్లో అత్యంత ఎక్కువ డబ్బులు వెదజల్లి గెలిచే విషయంలో. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం పనిచేయలేదు. పైసల ప్రభావం, పార్టీ ఎఫెక్ట్ కొంత మేర పనిచేశాయి. ఓ చోట బీసీ నినాదం గెలవకపోయినా నిలిచింది. మరోచోట ఘోరంగా ఓడిపోయింది. గంపగుత్తగా బీసీలకే ఓట్లేసి గెలిపించుకునేంత సీన్ ఈ ఎన్నికల్లోనే కాదు. ఏ ఎన్నికల్లో ఉండదనే విషయం మరోసారి రుజువైంది. మొత్తానికి బీజేపీ హవా కొంత కలిసిరాగా.. కాంగ్రెస్‌పై ఉన్నవ్యతిరేకత, క్యాండిడేట్ ఎంపిక లోపం కూడా కొంపముంచింది. బీఆరెస్ పోటీలో లేకపోవడం బీజేపీకి కలిసివచ్చింది.