(దండుగుల శ్రీనివాస్)
మళ్లీ పాత పాటే. పక్కా లోకల్ స్పీచ్. సీఎం రాష్ట్రానికి కాదు. పాలమూరుకే అన్నట్టుగా. రాష్ట్ర ప్రజలందరూ కలిసి గెలిపిస్తే కాకుండా… పాలమూరు వాళ్లతోనే తాను సీఎం అయినట్టుగా. గల్లీ లెవల్ స్పీచ్ మళ్లీ. తనను దిగిపోమంటున్నారని. మీరే నన్ను కాపాడాలంటూ పాలమూరు ముందు మోకరిల్లాడు. ఇక్కడి లీడర్లకు పాలించడం రాదనుకుంటున్నారని తనలోని ఇన్ఫిరియారిటీని బయటపెట్టుకున్నాడు.
గతంలో అక్కడి లీడర్లెవరెవరు పాలించారో వారందరి పేర్లు వల్లె వేసి బలాన్ని ప్రోది చేసుకున్నాడు. మగవాళ్ల మీద నమ్మకం లేదు. పాలమూరు ఆడోళ్ల మీదే నమ్మకం. మీ తమ్ముడిని మీరే కాపాడుకోవాలని వేడుకున్నాడు. ఫ్రీ బస్సు పథకం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తన ఆశయాన్నీ ముందంచాడు. వేల కోట్లు అభివృద్దికి ఎలా తెచ్చి ఇక్కడ పెడుతున్నాడో విడమర్చాడు.
మిగిలిన జిల్లాలను మరిచాడు. ఇప్పటి వరకు అన్ని జిల్లాలను చుట్టొచ్చిన పాపాన పోలేదు. కానీ… పాలమూరు జిల్లాల్లో చక్కర్లు కొడుతున్నాడు. బజాప్తా వేలకు వేలు ఇక్కడికే తెచ్చి పెడతానంటున్నాడు. బరాబర్ తెస్తా.. అని తెగేసే చెప్పడమే కాదు. మరోసారి.. మరోసారి… ఆ మరోసారి కూడా నన్నే సీఎం చేస్తారు మీరు.. ఆ నమ్మకం ఉందంటున్నాడు. నేనే సీఎంగా ఉంటానంటున్నాడు. పాలమూరు సీఎంగానే ఉంటానంటున్నాడు.