(దండుగుల శ్రీనివాస్)
బండి సంజయ్‌ను గుండుతో పోల్చాడు. కిషన్‌రెడ్డిని అరగుండుతో… ఏకంగా పీఎం మోడీని కమెడియన్ బ్రహ్మనందంతో పోల్చాడు. ఎవరో కాదు. సీఎం రేవంత్‌రెడ్డి. తిట్టుకోవడంలో, పోలికలు పెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో, ఆరోపణలు గుప్పించుకోవడంలో రాష్ట్ర నేతలు రోజు రోజుకు ఎదిగిపోతున్నారు. సీఎంతో సహ.
ఇలా ఇవాళ వనపర్తిలో జరిగిన సభలో సీఎం బీజేపీ నేతలను టార్గెట్ చేయడం… వారిని బాడీ షేమింగ్ చేయడం కలకలం రేపింది. రాష్ట్రానికి ఏం తేలేని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మోడీ దగ్గరు పోయి .. ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారని చెప్పడానికి ఆయన ఈ విధంగా పోల్చి చెప్పాడు. వరంగల్‌కు ఎయిర్ పోర్టును నేనే తెచ్చానని చెప్పుకుంటున్న కిషన్‌రెడ్డి, మూసీ గురించి, మెట్రో గురించి ఎందుకు మాట్లాడలేదు. అంటే వాటికి అడ్డుపడింది కిషన్‌రెడ్డే అని ఒప్పుకుంటున్నట్టే కదా అని చెప్పుకొచ్చాడు.