Dandugula Srinivas
బీజేపీ రోల్ ఇది. చెప్పేందుకేం లేదు. చేసిందీ మరేం లేదు. ఏం చేయాలి మరి. ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలె. వైరల్ కావాలె. ఆల్టర్నేట్ పార్టీ మేమే అని జనాలు నమ్మాలి. రేపు ప్రభుత్వం ఏర్పడేది మాదే అని పదే పదే చెప్పాలి. జనం చెవిన అదే మార్మోగాలి. అయితే ఏం చేయాలి. సీఎం దిగిపోతున్నాడు. సీఎం మారుతున్నాడు. సీఎంను మార్చుతున్నారు. సీఎంను మార్చబోతున్నారు. హహహహ… హ్హిహ్హిహ్హి…! అని ఓ అస్త్రం వదలాలె. పగలబడి నవ్వాలె. అది జనంలో ఎలా పనిచేసేందో గమనించాలె. రాజకీయాలు ఎలా వంకర్లు తిరుగుతున్నాయో వంకరబుద్దితో గ్రహించాలె. అదీ కదా చేయాలి. అదే కదా చేస్తున్నది. మరంతే. ఏం చేసినా వైరల్ కావాలె. ఏం మాట్లాడినా సంచలనం కలగాలె. ఎక్కడకు పోయినా కలకలం రేగాలె.
అవును. ఇదంతా జనాల కోసమే కదా. ఎహె ఊకోవయా సామి. జనాల కోసమా…? మనం లేంది జనం ఎక్కడ్నుంచి వచ్చారు. మనం పదిలంగా ఉండాలె. పార్టీ పచ్చగా ఉండాలె. అధికారం చేజిక్కించుకోవాలె. ఆ తరువాత జనానికి ఏదైనా చేసే ఆలోచన చేయాలె. అప్పటి దాకా ఇలా పొలిటికల్ గేమ్ ఆడాలె.
మరి… మరి జనాలు ఇవన్నీ ఇన్ని మరింత గాబరపడిపోయి… బెంబేలెత్తి.. హడలెత్తి .. ఆగమై… పరిషాన్ కారా..? కానీ. దానికి మనమేం చేస్తాం. ఎవరన్నా ఏమన్నా కాని. మనకు కావాల్సింది పొలిటికల్ మైలేజీ. దాని కోసం ఏమైనా చేయాలె. ఎవరినైనా బలిపెట్టాలె. ఆఖరికి జనాలైనా సరే. మరి ఇంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు డిసెంబర్‌లోగా సీఎంను మార్చేస్తారని. నీకెవరైనా చెప్పారా చెవిలో.
లేదా ఆర్‌కే లెక్క నువ్వు కూడా టెన్ జన్‌పథ్ టాయిలెట్లలో ఏవైనా సీక్రెట్ కెమెరాలు పెట్టినవా..? ఏహె ఊకోవయా సామీ. అట్ల కచ్చితంగా చెప్పినప్పుడే కదా జనం నమ్మేది. జనం నమ్మినప్పుడే కదా మన గురించి ఆలోచించేది. మరి పోటీలో ఉన్న లీడర్లు ఎవరైనా సరేనా సీఎం. ఎవరైతరంటవు. ఎవరైనా మనకు మరింత వీజీ. వాళ్లకంత సీన్ లేదు. ఉన్నోడిని కదిలియ్యాలె. డిస్టర్బ్ చేయాలె. ఆగం పట్టియ్యలె. అల్లకల్లోలం కావాలె. ఆ తరువాత మనం ఆడుకోవాలె. చివరగా అందరినీ
తొక్కుకుంటా గద్దెనెక్కాలె. ఇది కదా రాజకీయం. ఎప్పుడ్నేర్చుకుంటవ్ రాబై.