కిష్కింధకాండ…! అది అసెంబ్లీనా…! పుష్ప-2 సినిమా ధియేటరా..!! బీఆరెస్ సభ్యుల చర్యలు విస్మయం.. హరీశ్ తీరు, వ్యవహార శైలిపై విమర్శలు.. పేపర్లతో ఒకరిపై మరొకరి దాడులతో అభాసుపాలు..!! కాంగ్రెస్ సభ్యుడు చెప్పు చూపడం వివాదస్పదం.. !
(దండుగుల శ్రీనివాస్) అసెంబ్లీని మరీ రచ్చ రంబోలా చేసేశారబ్బా. అధికారం కోసం, ఈగో, ఫ్రస్ట్రేషన్ కోసం అసెంబ్లీని పుష్ప -2 థియేటర్ చేసేశారు. తోపులాటలు, పేపర్లు విసురుకోవడాలు, టికెట్ల కోసం తోపులాటల మాదరిగా స్పీకర్ చాంబర్ వద్దకు తోసుకుపోవడం.. యూజ్‌లెస్ ఫెలోస్…
