(దండుగుల శ్రీనివాస్)
శ్రీనివాస్‌రెడ్డిని సన్మానం చేసి అహోఓహో అని చెప్పుకుంటున్నరు.. కేసీఆర్ ఎలాంటోడో తెలిసిందా…? అని గొప్పలు చెప్పుకుంటున్నారు…
అలాంటి వారు వేలల్లో ఉన్నారు.. వారందరినీ కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసా..?
ఆస్తులు కరిగించుకున్నవాళ్లు.. ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్లు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా…??
కేసీఆర్ చేసిన పాపాలకు .. రేవంత్ రెడ్డి అన్నట్టు వేపచెట్టుకు కాదు.. మర్రిచెట్టుకు కట్టేసి కొట్టాలె…!
వాడో దుర్మార్గుడు.. అసలు ప్రపంచంలోనే ఇలాంటి వాడు పుట్టి ఉండడు.. అంత క్రిమినల్ గాడు…!
ఇప్పుడు మళ్లీ తెలంగాణ వాదం తీసుకొచ్చి ఏదో చేద్దామనుకుంటున్నాడు.. నమ్ముతారా..?
నమ్మాలంటే ఒకటే చేయాలె…!
తెలంగాణ ఉద్యమకారులందరినీ పిలిపించి వారికి ఘనంగా సన్మానం చేయాలె..!
దీంతోనైనా నాకు బుద్దొచ్చింది.. చెంప లేసుకుంటున్నాను.. అని చెప్పినట్టవుతుంది…!
ఉద్యమకారులకు ఎంతో కొంత ఉపశమనమైతే లభిస్తుంది…?
నమ్ముతారా…?
నమ్మడమంటే ఓ సగం మందైనా నమ్ముతుండొచ్చు…!
అంతకు మించి చేసేదేం లేదు… కేసీఆర్. ఆయన భార్య కూడా రానవసరం లేదు.. ఒక్కడు వచ్చి సన్మానం చేసినా సరే..!
కనీసం ఉద్యమకారులను ఇప్పటికైనా గుర్తించారని క్షమించేసే అవకాశం ఉంది…!
అంతేకాదు.. ముక్కు నేలకు రాసినట్టుగా… ఈ కార్యక్రమంలో మీ అందరికీ న్యాయం చేస్తా.. మిమ్మల్ని అన్యాయం చేసి చాలా తప్పు చేశానని కూడా చెప్పాలె…!
చెప్తాడా..??
చెప్పాలె. తప్పుదు.
చెప్తే నమ్ముతారా…?
నమ్ముతారు.. కొంత మందైనా. రియలైజ్ అయ్యిండు. కష్టపడి పనిచేద్దాం.. మళ్లీ పార్టీని నిలబెట్టుకుందాం అని అనుకుంటారు…!
ఆ పని చేయకుండా ఇలా దీక్షా దివస్‌లు చేస్తే మళ్లీ సెంటిమెంట్ వస్తుంది… అనుకుంటే వాడో మూర్ఖుడే.