(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పై బీఆరెస్ మండిపడుతోంది. వాట్సాప్ డీపీలు, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌లు మార్చేసుకుని పాత తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిమను పెట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించాడు. ఇదో ఉద్యమంలా తీసుకుపోతున్నామని బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇదే అంశం రచయితలు, ఉద్యమకారులంతా కలిసి గొంతెత్తితే ఆ గొంతుకు జీవం పోయలేదు కేటీఆర్ అండ్ టీం. ఆ పార్టీ కరపత్రిక నమస్తే తెలంగాణ.
ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ రచయితల సంఘం సమావేశం జరిగింది. ఈ మీటింగుకు చాలా మంది రచయితలు, ఉద్యమకారులు వచ్చారు. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం కూడా ప్రధానంగా వచ్చింది. దీన్నివ్యతిరేకించారంతా. బతుకమ్మ లేకపోవడాన్ని తప్పుబట్టారు. కానీ ఈ వార్తను ఈనాడు ఇచ్చినట్టుగానే సిటీ టాబ్లాయిడ్‌కు చిన్నవార్తగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరి దీన్ని కేటీఆర్ పట్టించుకోలేదెందుకో…? ఆ పత్రికను చూడటం మానేశాడా..? ఆ ఎడిటర్ కృష్ణమూర్తి మీద నమ్మకం లేకనా…? తెలియదు.
చిన్నవార్త వేసి వదిలేశారు. ఫామ్‌హౌజ్ నుంచి సోషల్ మీడియాపై డేగకన్ను వేసి చూసే కేసీఆర్‌కూ ఇది పట్టలేదు. నెలకు కోట్లకు కోట్లు సోషల్ మీడియాకు గుమ్మరిస్తున్నా .. ఆ టీము కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిది తెలంగాణ రచయితలు, ఉద్యమకారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్, కేటీఆర్ ఇంకా మారరా…? వీరులేనిదే ఉద్యమం నడిచిందా..? ఇప్పుడు తెలంగాణ భావజాలాన్ని మళ్లీ రగిల్చే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్… వీరి గురించి ఎందుకు పట్టించుకోలేదు. అదే నమస్తే తెలంగాణ పత్రికలో దేశ్‌పత్రి శ్రీనివాస్ ఇంటర్వ్యూను కుమ్మేశాడు ఎడిటర్. తన కులం వాడైతే ఇలా ఉంటుందన్న మాట. ప్రభుత్వ సత్కారాన్ని స్వీకరించని నందిని సిధారెడ్డి వార్త లేదు. కానీ కేటీఆర్ ప్రశంసించిన వార్త మాత్రం పెట్టుకున్నారు. ఇలా ఉంది కేటీఆర్ అండ్ టీమ్ వ్యవహార శైలి. చెప్పేదొకటి. చేసేదొకటి.