చిరంజీవి ఇంతలా దిగజారిపోయాడా ?
మొన్న ‘లవ్ స్టొరీ’ సినిమా ఫంక్షన్లో చిరంజీవి సినీ రంగపు సమస్యల పరిష్కారం విషయమై జగన్ ను అభ్యర్ధించిన తీరును చూసి నాకు చాలా జుగుత్స,అసహనం కలిగాయ్. అసలు ఈ సినిమా వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి మొత్తం దేశ రాజకీయాలనే నాశనం…
సిగ్గులేని సినిమారంగం!
అగ్రహీరోలు తమ పారితోషికంలో ఒక్క రూపాయి కూడా తగ్గించుకోరు. ఎంత కరోనా అయినా సరే సినిమాకు పాతిక కోట్లనుంచి డెబ్భైకోట్ల రూపాయలు గోళ్లు ఊడగొట్టి నిర్మాతల దగ్గరనుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వం మాత్రం సామాన్య ప్రేక్షకుల గోళ్ళూడగొట్టి టికెట్ ధరలను నాలుగురెట్లు…
సన్నాలు లేదంటే ఆరుతడి… వరి నుంచి రైతును దూరం చేసేందుకు సర్కార్ యత్నాలు.. శిక్షణ కార్యక్రమాలు…
వరిసాగు నుంచి క్రమంగా రైతును ఇతర పంటల వైపు మళ్లించేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పడంతో యాసంగి సీజన్‌లో వరి సాగుచేస్తే ధాన్యం కొనుగోలు చేయమనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. గతంలో ఈ…
ప్రతీనెల వచ్చే ఆసరా దరఖాస్తుల్లో 80శాతం వితంతు పింఛన్ల కోసమే….ఇందులో ముస్లిం మహిళలవే ఎక్కువ..
ప్రభుత్వం కొత్త పింఛన్లకు మంజూరి ఇవ్వడం మానేసి రెండున్నరేండ్లు అవుతున్నది. అవి అలాగే సర్కారు దగ్గర మూలుగుతూ ఉన్నాయి. దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. దీని ఊసు లేదు. దీని గురించి ప్రభుత్వం ఇప్పట్లో పట్టించుకునే…
రిపోర్టర్ రాజారాడ్డి.. ధారావాహిక-4
“ఆ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించింది కరోనానే.” అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. వెంటనే తేరుకుని దీనికి దారితీసిన పరిస్థితులను ఎవరికి వారు అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా నరహరి ఏం చెబుతాడోనని ఆత్రుత నిండిన వదనాలతో చూస్తున్నారు.…
మన లీడర్ల స్థాయి పెరిగింది… అందరికీ డ్రగ్ టెస్ట్ చేయాలంటా..?
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా డ్రగ్ టాపిక్ నడుస్తున్నది. ఈడీ విచారణ నేపథ్యం ఇందుకు ఆజ్యం పోసింది. ఆరేళ్ల చిన్నారి అత్యాచార, హత్య ఉదంతంలో కూడా డ్రగ్ వినియోగం అంశం చర్చకు వచ్చింది. దీన్ని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకునేందుకు అధికార…
జర్నలిస్టుల వినతిపత్రాల వేదన వినేదెవ్వరూ..?
అప్పుడప్పుడు జర్నలిస్టు సంఘాలు బతికే ఉన్నాయని చెప్పడం కోసం వినతిపత్రాలు ఇస్తూ ఉండాలె. చాంతాడంత అమలు కానీ డిమాండ్లను పొందుపర్చి సీఎంకు పంపుతూ ఉండాలె. ఏండ్ల తరబడి ఇవేవీ అమలు కావు.. అన్నీ బుట్టదాఖలేనని తెలిసినా అలా అప్పుడప్పుడు మన ఉనికి…
ఇక ఎలక్ట్రికల్ బైక్‌ల శకం…
పెట్రోలు ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న తరుణంలో మళ్లీ ఎలక్ట్రికల్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఒకసారి ఈ ప్రయోగం జరిగినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు అదుపులో లేకుండా పోయాయి. మున్ముందు ఇంకా ఎంత వరకు పెరుగుతాయో తెలియదు.…
డ్రగ్స్ చుట్టూ రాజకీయాలు… కేటీఆర్‌ను డిఫెన్స్‌లో పడేస్తున్న కాంగ్రెస్..
డ్రగ్స్ కేసు అటూ ఇటూ తిరిగి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఎప్పుడైతే ఈడీ మళ్లీ ఈ డ్రగ్స్ కేసును తిరగదోడి మనీ ల్యాండరింగ్ కేసులో మళ్లీ విచారణ చేపట్టడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దీన్ని…
షుగర్ వచ్చిందని అన్నం మానేస్తే అంతే సంగతులు…
ప్రస్తుతం మారుతున్న మానవుని జీవనశైలిలో భాగంగా షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరికి కామన్‌గా మారింది. 30 ఏండ్ల నుంచే మధుమేహం వ్యాధిన పడుతున్నారు. షుగర్ రాగానే ఒక్కసారిగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. అప్పటి వరకు అన్నమే పూజిస్తూ బతికిన జనాలు…
