మొన్న ‘లవ్ స్టొరీ’ సినిమా ఫంక్షన్లో చిరంజీవి సినీ రంగపు సమస్యల పరిష్కారం విషయమై జగన్ ను అభ్యర్ధించిన తీరును చూసి నాకు చాలా జుగుత్స,అసహనం కలిగాయ్. అసలు ఈ సినిమా వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి మొత్తం
దేశ రాజకీయాలనే నాశనం చేసిపడేశారు.పుష్కర కాలం
క్రితం నేను మొత్తం రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తానని బయలు దేరిన ఆ వ్యక్తి ఈ రోజున ఆనాటి రాష్టంలో సగం ముక్కకు ముఖ్యమంత్రిని,తన వయసులో సగం వయసున్న వాడిని పబ్లిక్ స్టేజ్ మీద ” మాదాకబలళం తండ్రీ ” అని బిచ్చగాళ్లు అడుక్కున్న తరహాలో అడుక్కోవడం చూసి నాకు సితార
సినీమాలో “సుమన్ ” బృందం రాజు గారి కోట దగ్గర రాజు
గారి నజరానా కోసం పడిగాపులు పడే సీను గుర్తోచ్చింది.

అందులో హీరో పాత్రధారి సుమన్ ఆ పనికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ మన మెగాస్టార్ ఎంతో వినయంగా,ఇష్టంగా ఆ పని చేసాడు.అతను వాళ్ళ సినీ పరిశ్రమ మంచి కోసం
అడుక్కుంటే నీకు నెప్పేంటిరా అని అడక్కండి.అలా వారు
అడుక్కుని అడుక్కుని ప్రజాసేవకులుగా ఉండవలసిన
ప్రజాప్రతినిధులకు “ప్రభువుల” హోదా కట్టబెడుతున్నారు.
ప్రజలు వారికి ప్రభుత్వంతో ఏ పని కావాల్సివచ్చినా ప్రజా ప్రతినిధుల కాళ్ళా వేళ్లా పడి చేయించుకోవాల్సి వచ్చేలా
వారి స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు.

అయినా ఈయన ఏమైనా తక్కువా,వాళ్ల ఇంట్లో వాడిది ఎవడి సినిమా ప్రారంభమయినా కుటుంబం అంతా బెంజ్ లు,ఆడీలు,రోల్స్ రాయిస్ లు వేసుకుని మనం చూడడం మిస్సయిన మహారాజుల వైభోగాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు.ఇదేకాక వందలకోట్లతో కట్టించుకున్న వారి విలాసవంతమైన ఇళ్ళ వీడియోలు చూపించి వారెంత
సంపాదిస్తున్నదీ మనకు చూపిస్తూనే వున్నారు. అలాంటి వాళ్ళు నలుగురయిదుగురు కలిసి సినిమా రంగంలో ఉన్న మొత్తం సమస్యలను వాళ్లలోవాళ్ళు పరిష్కరించుకోలేరా? ఒక వేళ ప్రభుత్వం కావాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే తమ కళ ద్వారా ప్రజలను జాగృత పరచి ఆయా ప్రభుత్వాలను కూలగొట్టలేరా ? అడుక్కోవడం ఒక్కటే వారికి తెలిసిన పరిష్కార మార్గమా ???

 

Raghu Srimanthula