Category: Political Gossips

లక్ష రూపాయల చెప్పులు…. అసెంబ్లీలో మల్లారెడ్డి మాటలు తీవ్ర దుమారం… బీఆరెస్‌ ఎమ్మెల్యేల ఇజ్జత్‌ తీసుకుంటున్న ఆ పార్టీ నాయకులే.. ఇప్పుడున్న వ్యతిరేకత చాలదంటూ తమకు తామే గొయ్యి తొవ్వుకుంటున్న అధికార పార్టీ…

సందర్భమేంటో తెలియదు..ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అవి అన్యపదేశంగా వస్తాయో… అప్పటికప్పుడు వస్తాయో.. ముందే అనుకుని మాట్లాడతారో… అవగాహన లేకనో… మిడిమిడి జ్ఞానమో…. ఏదైతే ఏమిగానీ.. మాట్లాడింది మాత్రం వాస్తవం. ప్రజల ముందు ఉన్నదున్నట్టు చెప్పుకోవడం కూడా ఓ కళ. ప్రజలకూ…

తండ్రికి రెస్పెక్ట్‌.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్‌ చిల్లర భాషపై వాతలు…. తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది.

కేటీఆర్‌లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్‌ కనిపిస్తాడు. అప్పుడే మాస్‌గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్‌ నగర…

సిట్టింగులకు ఫిట్టింగు…! ఇది కేసీఆర్‌ వ్యూహంలో భాగం..? 25 మంది ఎమ్మెల్యేలు కాదు కేసీఆర్‌ టార్గెట్‌ 40 మంది…. ఎర్రబెల్లి చేత ట్రయిలర్‌… ఆ తర్వాత సిట్టింగులకు ఎసరు..

కేసీఆర్‌.. ఏది చేసినా ఓ వ్యూహం ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో మర్మముంటుంది. ఏది చెబితే దానికి రివర్స్‌ ఫలితం ఉంటుంది. రెండోసారి సిట్టింగులకే టికెట్లిచ్చాడు. మూడోసారీ మీకే అన్నాడు. కానీ ఎమ్మెల్యేలపై చాలా చోట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. వాళ్లకే…

కేసులతో మీరు కెలికితే… పాలసీలపై మేం పంజా విసురుతాం… బీజేపీపై బీఆరెస్‌ ఎత్తుకు పైఎత్తు రాజకీయ క్రీడ… రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా…

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్‌ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో…

బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..

తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…

కొంప ముంచింది మీరే..ఇప్పుడు సేవ్‌ కాంగ్రెస్‌ నినాదమా..? రేవంత్‌ను గద్ద దింపేదాకా ఈ లొల్లి ఆగేలా లేదు.. మీరు గెలిచి గద్దెనెక్కేదీ లేదు…

కాంగ్రెస్‌ను ఎవరూ బొంద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పాతాళంలోకి తొక్కి ఘోరి కట్టాల్సిన పనీ లేదు. కేసీఆరే బాగా కష్టపడ్డాడు పాపం… ఎక్కడ కాంగ్రెస్‌ తనకు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందో.. అని ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనిపడేశాడు. కానీ తర్వాత గానీ…

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మీడియా తీరును ఏకిపారేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి సేవలు ఇక దేశవ్యాప్తం… రెడీగా ఉండాలని పిలుపు.. సీబీఐ,ఈడీల దాడులు తనతో మొదలు కాదు.. దేశంలో ఇప్పుడిది కామన్ అని లైట్ తీసుకున్న కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము…

తెలంగాణ జాగృతిలో చలనం… కవితపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో తెరపైకి జాగృతి.. మోడీపై నిరసన జ్వాలలు.. మొన్నటి వరకు నిస్తేజం.. ఇప్పుడు కదనోత్సాహం… బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్‌ వ్యూహం..

తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు…

మా బలమేందో చూపిస్తాం…. ఈడీ, సీబీఐ ఎంక్వైరీల నేపథ్యంలో రేపు జాగృతి సమావేశం… భవిష్యత్‌ కార్యచరణపై కవిత సందేశం.. కేసీఆర్‌ వ్యూహాత్మ ఎత్తుగడ…

గల్లీ లొల్లి ఢిల్లీకి చేరింది. కేసీఆర్ బీఆరెస్‌ పై అప్పుడే దాడి షురూ అయ్యింది. సీఎం బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఇరుకున పెట్టేందుకు అన్ని దారుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది. ఇవాళ సీబీఐ ఏడు గంటల పాటు…

బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్‌ సెషన్‌ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్‌ స్కాం…

కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్‌. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్‌ .. బీఆరెస్‌గా రూపాంతరం చెందిన తర్వాత…