ది ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్… అరుదైన, సరైన సమయాన్ని చజేతులా జారవిడుచుకున్న కేటీఆర్.. కోటరి మాటలు నమ్మి… వాస్తవికతకు దూరంగా ఆలోచనలు… హైదరాబాద్ చుట్టే ప్రదక్షిణలు.. జిల్లాల్లో పట్టు శూన్యం.. లోకల్ లీడర్లకే పెత్తనం ఇచ్చి తాను మాత్రం ఉత్సవ విగ్రహంగానే ఉండిపోయిన వైనం.. జిల్లా అధ్యక్షులు ఎంపిక టోటల్ బూమరాంగ్.. ఎవరిస్తున్నారో సలహాలు..? అవి తనవే అయితే పూర్తిగా మెచ్యూరిటీ లేనివే.. కేసీఆర్ అందుకే కేటీఆర్‌ను మొదటి నుంచి నమ్మనిది..
(దండుగులు శ్రీనివాస్, వాస్తవం ప్రతినిధి) కేటీఆర్. మంచి విజన్ ఉన్న నేత. భవిష్యత్ అంతా తనదే. బాగా కష్టపడే మనస్తత్వం. కానీ ఎన్నో లోపాలు. వేసే ప్రతీ అడుగులో తప్పటడుగులు. తన కోటరీ చెప్పిందే వేదం. కోటరిలో ఉన్నదంతా అరకొర, మిడిమిడి…
