పాలాభిషేకాల పాలన షురూ..! కేసీఆర్ పాలనలో పొడగ్తలు, పాలాభిషేకాలు.. !! నాడు వీటికి బాగా అలవాటు పడ్డ కేసీఆర్.. ఇప్పుడు అదే బాటలో రేవంత్ సర్కార్.. పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్.. సంబురాలంటూ ప్రచార యావ.. నాడు కేసీఆర్ చెప్పిందే వేదం.. తనకు తోచిందే పాలన.. లోపాలు వేలెత్తి చూపేవారు కరువు.. బహుబాగు అంటూ పొడిగి మరింత భ్రష్టు పట్టించేలా చేసిన భజన నేతలు.. దీనికి అతీతుడని కాదని నిరూపిస్తున్న రేవంత్..
మళ్లీ అదే పాలన షురూ అయ్యింది. దేన్నైతే ప్రజలు తిరస్కరించారో, దేనికైతే విసిగెత్తిపోయారో.. అదే తంతు మళ్లీ మొదలైంది. కేసీఆర్ పాలన అంటే ఎందుకు జనాలకు విసుగొచ్చింది. తను చెప్పిందే వేదం.. తనకు తెలిసిందే పాలన అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపాడు.…
