దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌..:

కేటీఆర్‌ నాడు నోటికేదొస్తే అది మాట్లాడి మోడీని టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు అదే మోడీ ప్రాపకం కోసం రాహుల్‌ను టార్గెట్‌ చేశాడు. చేస్తే చేశాడు కానీ ఆ టపిక్‌ మరీ నవ్వులాటలా ఉంది బాసు. ఏ టాపిక్‌..? ఏందీ కథా….? అంటారా. పాపం చెల్లె కవిత కోసం కేటీఆర్‌.. బీజేపీ జపం చేస్తున్నాడు. పరోక్షంగా ఆ పార్టీకి వత్తాసు పలుకుతూ ఆ పార్టీ ప్రధాన శత్రువైన రాహుల్‌గాంధీని ఎడాపెడా చెడామడా తిట్టాడు. అదీ ఢిల్లీ కేంద్రంగా. మొన్నటి దాకా అక్కడే మకాం వేశారు బావబామ్మర్దులిద్దరూ.

సుప్రీంను ఆశ్రయించారు. అయినా చెల్లె బయటకు వచ్చేలా లేదు. ఆమే ఓ వైపు కేసీఆర్‌, కేటీఆర్‌ పై విరుచుకు పడుతున్నది. విడిపిస్తారా..? తడాఖా చూపాలా అనే రేంజ్లో బావకు వార్నింగ్‌ ఇవ్వడంతో బావమరిదిని వెంటబెట్టుకుని ఇలా ఢిల్లీలో మకాం వేశాడు. ఇవాళ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టున్నాయి. ఇలా జాతీయ మీడియా ముందు కేటీఆర్‌ షరా మామూలుగా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

ఆనాడు తన తండ్రి కేసీఆర్‌ రాజకీయ పునరేకీకకరణ పేరుతో కాంగ్రెస్‌ను ఖాళీ చేయించాడు. అదే బాటలో ఇప్పుడు రేవంత్ నడుస్తున్నాడంతే. ఇద్దరూ చెప్పే మాటలు. మా ప్రభుత్వం కూలకుండా కాపాడుకుంటున్నాం. అంతే. అంటే ఈ వచ్చినవాళ్లు ఎవరూ నిలకడగా ఏపార్టీలో ఉండరు. ఆ విషయం వారికీ తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్‌ అవుతారు. అంతే.

ఇక ఇప్పుడు శ్రీరంగనీతులు చెబుతున్నాడు కేటీఆర్‌. ఎవరు పట్టించుకునేది. అక్కడ కేసీఆర్‌ మాట్లాడితేనే పోపోమంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కేటీఆర్‌ మాటలకు విలువేది. విలువ తీసుకున్నదెవరు..? ఈ దుస్తితికి కారణం ఎవరు..?? పశ్చాత్తాపం లేదు. ఇంకా అధికార దర్పమే. అందుకే ఇలా తయారయ్యింది మీ పార్టీ.

 

You missed