.ఏపీ దేవాదాయశాఖలో ఇప్పుడు కొత్త లొల్లి తీవ్ర చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతిపై ఆమె భర్తే అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాదు అంతటా వైరల్ అవుతోంది. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు శాంతి భర్త మదన్‌మోహన్ ఫిర్యాదు చేశాడు.
తను విదేశాల్లో ఉన్నప్పుడు భార్య గర్బం దాల్చిందని, దీనికి ఇద్దరిపై తనకు అనుమానం ఉందంటూ.. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్‌ల పేర్లను వెల్లడించాడు. ఇటీవలే శాంతిని దేవాదాయ శాఖ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆమె భర్త ఫిర్యాదు సంచలనంగా మారింది.