దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

తాను పార్టీ పెట్టినప్పుడు గుప్పెడు మందితోనే పెట్టానని, అంతా హేళన చేశారని కేసీఆర్‌ అంటుంటాడు. చివరికి అదే పరిస్థితికి నేడు చేరింది.ఉన్న ఎమ్మెల్యేలంతా తలోదారి చూసుకుంటున్నారు. అందరినీ ఫామ్‌ హౌజ్‌కు రమ్మంటే.. వచ్చింది ఇగో ఈ గుప్పెడు మందే. అధికార దర్పంతో బీఆరెస్‌ పార్టీ,ప్రభుత్వం ఎలా ఉండేది..? ఇప్పుడెలా అయ్యింది.ఎవరు కారణం.. స్వయంగా కేసీయారే ఇదంతా చేసుకున్నది. ఉద్యమ సమయంలో ఒక మాట.. అధికారం వచ్చిన తరువాత ఒక చేత. అసలు ఆగితే కదా. ఎవరి మాటైనా వింటే కదా. ఉద్యమకారులను పక్కన పెట్టాడు. రాజకీయ పునరేకీకరణ పేరుతో గుంపును మొత్తం లాగాడు. డబ్బుల ఆశ చూపాడు.

ఎన్నికలను కాస్ట్లీ ఎన్నికలు చేసి కూర్చున్నాడు. వీటంతటికీ కారణం.. తన పరికితనం. అధికార యావ. ఈ రెండూ కేసీఆర్‌ను ఓ భయంకర రాజకీయ వేత్తగా మార్చాయి. అయినా డోంట్‌ కేర్‌ అన్నాడు. ఎవరేమనుకుంటే నాకేంటి..? నాకు కావాల్సింది అధికారం అని డిసైడ్‌ అయ్యాడు. పైకి మాత్రం చేసేదంతా తెలంగాణ కోసమే అని కలరింగ్‌ ఇచ్చాడు. కానీ జనాలు అన్నీ గమనిస్తూ వచ్చారు. అదును చూసి కర్రుకాల్చి వాతలు పెట్టారు. కోట్లకు కోట్లు ప్రజాధనం విరజిమ్మి కొన్న ఎమ్మెల్యేలు, నేతలంతా ఇప్పుడు లేరు. ఓడారు. గెలిచిన వారు పారిపోయారు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటారు. కేసీఆర్ ఇప్పుడు అదే గోతిలో పడ్డాడు. పైకి లేపేందుకు మిగిలిన ఈ గుప్పెడు మంది ఫామ్ హౌజ్‌కు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed