దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: బావబామ్మర్దులిద్దరూ ఢిల్లీలో మకాం వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏదైనా చేసైనా కవితకు బెయిల్ ఇప్పించుకుని బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఇద్దరూ గత నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో గత నాలుగు నెలలుగా కవిత తీహార్‌ జైల్లోనే ఉన్నది. ఈడీ ఓ సైడు, సీబీఐ మరో వైపు.. ఆమెను బయటకు రాకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బయటకు వస్తే ఆధారాలు తారుమారు చేస్తుందనే ప్రధాన ఆరోపణతో ఆమెకు బెయిల్‌ రాకుండా తీర్పు రాబట్టడంలో సక్సెసవుతున్నారు.

ఇది మొన్నటి వరకు రాజకీయంగా బాగా ప్రాధాన్యతను సంతరించుకున్న ఇష్యూ. దీన్ని మోడీ సీరియస్‌గా తీసుకున్నాడు. అనుకున్నది సాధించాడు. కేసీఆర్‌ మెడలు వంచాడు. కానీ ఇప్పుడు…. ఎన్నికలు ముగిశాయి. మళ్లీ ఎలాగోలా మోడీయో పీఠం ఎక్కాడు. ఇక ఓ ఆడబిడ్డపై కక్షసాధింపేలా..? ఇన్ని రోజులు జైళ్లో పెట్టాలా..? నిజంగా లిక్కర్ స్కాంలో, మానీలాండరింగ్‌ కేసులో ఆమే ప్రధాన సూత్రధారి అయినా..ఇంతకు మంచిన ఆర్థిక నేరాలకు పాల్పడిన నేతలు లేరా.. ? బీజేపీలో అంతా బుద్దిమంతులు, నీతిమంతులేనా..?? అనే చర్చ రాజకీయంగా వినిపిస్తుంది. తొలత కవిత జైలుకు వెళ్లిన ఉదంతంలో ఆమెకు సానుభూతికి అనుకున్నంత రాలేదు. మంచిగా అయిందనే కామెంట్లే ఇంటా బయటా వినిపించాయి.

ఇప్పుడు నాలుగు నెలలుగా ఈ అంశం మరీ పాతబడింది. కవిత బెయిల్‌కు అప్లై చేయడం, నిరాకరించడం..రొటీన్‌ డైలీ సీరియల్ ఎపిసోడ్‌లా మారింది. దీంతో జనాలకూ విసిగెత్తింది. ఈ విషయానికి అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదు. మరోవైపు మోడీకి కవిత ఇష్యూ ఓ రాజకీయ అంశంగా, ఓ పావుగా ఉపయోగపడింది. ఇప్పుడు రాజకీయ అవసరాలు ముగిశాయి. మరి ఇంకెందుకు కవితను జైళ్లో పెట్టడం…? అందుకే కేటీఆర్‌, హరీశ్‌లిద్దరూ కవిత కోసం ఢిల్లీలో మకాం వేశారు.

గత నాలుగు రోజులుగా అక్కడే తిష్ట వేశారు. కేటీఆర్‌కు ఇలాంటి విషయాల్లో పెద్దగా అనుభవం లేదు గానీ, హరీశ్‌ అన్ని కోణాల్లో అర్సుకు రాగలడు. అందుకే ఈ ఇద్దరినీ ఢిల్లీ పంపాడు కేసీఆర్‌. ఇప్పుడు ఇదే అంశం బీఆరెస్‌ సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌గా మారింది. కవితకు ఇక బటయకు వస్తుంది అనే ప్రచారం మళ్లీ ఊపందుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed