దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో :
పీసీసీ చీఫ్ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టేసింది అధిష్టానం. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నేటితో ముగిసింది. దీన్ని త్వరగా పూర్తి చేస్తారని భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చారు. కారణం. ఈ పదవి కోసం తీవ్రమైంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, మధుయాష్కీలు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి దీన్ని కేటాయించాలో ఆ సమీకరణలు అంతుపట్టక చీఫ్ నియామకాన్నే పెండింగ్‌లో పెట్టేసినట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మహేశ్‌కుమార్ గౌడ్ పేరును అధిష్టానానికి సూచించినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ కు జూలై 2న ముహూర్తం ఖరారైంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కనుంది. హోం శాఖ కేటాయిస్తారని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి తెరపడింది. తాజాగా పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా నుంచి పలువురి పేర్లు వినిపించాయి.
కానీ అంతిమంగా రేవంత్, అధిష్టాం సీనియార్టీకే మొగ్గు చూపింది. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమైపోయింది. పీసీసీ మాత్రం మరో మూడు నెలల వరకు పెండింగ్‌లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు రేవంతే దీన్ని నెట్టుకురానున్నట్లు తెలుస్తోంది.