Category: Local News

కమీషన్లు ఇయ్యలేం.. పనులు చెయ్యలేం.. సిట్టింగులు ముక్కు పిండి వసూలు చేశారు.. ఇప్పుడు కొత్తోళ్లు లైన్ కట్టారు.. పనులు బంద్‌ చేసిన కాంట్రాక్టర్లు.. పిలిచి సమావేశాలు పెట్టి చెయ్యమన్నా నో చెప్పేస్తున్న వైనం.. జిల్లాలో ఇదో వింత వైఖరి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పాపం.. కాంట్రాక్టర్లు. అసలే అరకొర నిధులు. సమయానికి రాని బిల్లులు. అప్పుల పాలు చేసిన కేసీఆర్‌. ఇవన్నీ చాలవని ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది వారికి. చాలా చోట్ల సిట్టింగులు ఓడారు. కొత్త వారు…

ఆరు గ్యారెంటీల కోసం.. కొత్త కుటుంబాలు పుట్టుకొచ్చాయ్‌.. ఉమ్మడి కుటుంబాలు వేరు పడ్డాయి.. పుట్టుకొచ్చిన 57,808 కొత్త కుటుంబాలు.. జిల్లాలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 4, 20, 000 … వచ్చిన మొత్తం దరఖాస్తులు 4,77,808… కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిపివేయడంతో ఇలా దరఖాస్తుల రూపంలో బయటపడ్డ కొత్త కుటుంబాలు.. సమగ్ర కుటుంబ సర్వేను తలపించిన ప్రజాపాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తులు…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఆనాడు కేసీఆర్‌ సీఎంగా అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో నిర్వహించి మొత్తం డేటా సేకరించాడు. సేమ్‌ అదే తరహాలో కొన్నిరోజుల పాటు సమయం తీసుకుని రేవంత్‌ సర్కార్‌ ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల…

ఇందూరు బీఆరెస్‌ జిల్లా అధ్యక్షుడి మార్పు.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని కేటీఆర్‌ నిర్ణయం.. పలువురి నేతల ఒత్తిడి…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిస్తేజంలో ఉన్న ఇందూరు బీఆరెస్‌లో నూతనోత్తేజం నింపేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది బాల్కొండలోనే. ప్రశాంత్‌రెడ్డి గెలుపుతో ఆయనకే జిల్లా పార్టీ…

ఆరుగురుని మట్టుబెట్టిన సీరియల్‌ కిల్లర్‌.. నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. పదిహేను రోజుల్లో ప్రాణ స్నేహితుడు, అతని కుటుంబీకులను హత్య చేసిన నరరూప రాక్షసుడు.. స్నేహితుడి ఇంటి కోసం.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మాక్లూర్‌కు చెందిన సైకో కిల్లర్‌ గొల్ల ప్రశాంత్‌.. ప్రసాద్‌తో పాటు అతని భార్య, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు చెల్లెండ్లను మట్టుబెట్టిన ప్రశాంత్‌.. చెల్లెండ్లను తగులబెట్టి… పసి పిల్లలను, భార్యను గొంతు నులిమి వాగులో వేసి.. స్నేహితుడిని చంపి బొందపెట్టి.. ఆరు రోజుల్లోనే చాకచక్యంగా కేసును చేధించిన పోలీసలు.. సైకో కిల్లర్‌ ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులు అదుపులో.. ఓ పార్టీ లీడర్‌తో సత్సంబంధాలు.. వారితో దిగిన ఫోటోలు చూపి అరాచకాలు… మృతుడు ప్రసాద్‌కూ నేర చరిత్ర..(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌)

(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌) దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిండా ముప్పై ఏండ్లు లేవు వాడికి. ఓ పదిహేను, ఇరవై లక్షల ఇంటి ఆస్తి కోసం ..తన ప్రాణ స్నేహితుడిని, అతని కుటుంబ సభ్యులను పదిహేను రోజుల్లోనే ఆరుగురిని మట్టుబెట్టాడు సైకో సీరియల్‌…

దళితబంధు కొంపముంచింది… బీజేపీ మేయర్‌ సీటుపై కన్నేసింది.. ఇక బీఆరెస్‌లో ఉండలేమంటున్న బీఆరెస్‌ కార్పొరేటర్లు.. బీజేపీలోకి నలుగురు కార్పొరేటర్లు జంప్‌.. ఇంకా లైన్లో మరికొంత మంది.. నష్టనివారణకు దిగిన కవిత, బిగాల… ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నాలు .. ఇప్పటికైతే సఫలం.. రేపటికేమౌనో..?

దళితబంధు అర్బన్‌ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేశ్‌గుప్తా కొంపముంచింది. ఎడాపెడా ఇష్టమొచ్చినట్టు అందరికీ హామీలిచ్చేశాడు. నీకిన్ని నీకిన్ని అంటూ వాటాలు పంచేశాడు. వారంతా జనాల వద్ద కమీషన్లు నొక్కేశారు. తీరా చూస్తే ఎన్నికలొచ్చాయి. బీఆరెస్‌ ను తిరస్కరించారు ప్రజలు. దళితబందు లేదు..…

ఇందూరులో పడగెత్తిన పొలిటికల్‌ ఫ్యాక్షనిజం.. ‘మాజీ’లపై ‘తాజా’ల దండయాత్ర.. పదేళ్ల పగ.. కట్టలుతెంచుకున్న ప్రతీకారం.. బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యేలపై అధికార, బీజేపీ పార్టీల దాడులు

దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: ఇందూరులో ఫ్యాక్షన్‌ రాజకీయాలు పడగలెత్తాయి. మొన్న మొన్న ఎన్నికలు ముగిశాయో లేదో కానీ.. అప్పుడే పగ కట్టలు తెంచుకుంటున్నది. ఫ్యాక్షన్‌ రాజకీయాలు పడగవిప్పుతున్నాయి. ఆర్మూర్‌, బోధన్‌ మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌లు టార్గెట్‌గా ప్రతీకార…

ప్రియమైన శత్రువు… ప్రాణమిత్రులు.. బద్దశత్రువులు.. షకీల్‌ను టార్గెట్‌ చేసిన శరత్‌రెడ్డి.. షకీల్‌ రైస్‌మిల్లుల అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. అధికారులతో దాడులు.. రైస్‌మిల్లుల వ్యాపారంలోకి తీసుకొచ్చింది శరత్‌రెడ్డే.. ఇప్పుడు అదే వ్యాపారంలో షకీల్‌ను ఇరికించిన వైనం..

ఇద్దరు ఒకప్పుడు ప్రాణమిత్రులు.. ఒకరి విడిచి మరొకరు ఉండలేని సన్నిహిత స్నేహం. రాజకీయాలకంటే తనకు స్నేహమే ముఖ్యమనుకున్నాడు శరత్‌రెడ్డి. రాజకీయంగా ఓ స్థాయికి తెచ్చాడు షకీల్‌. అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే శరత్‌రెడ్డి సతీమణిని బోధన్‌ మున్సిపల్‌గా షకీల్‌ చేశాడో..…

ఇందూరు బీఆరెస్‌ అనాథ.. ఒకప్పుడు కంచుకోట.. ఇప్పుడు దిక్కులేని అనాథ.. గ్రూపు రాజకీయాలతో, పట్టులేని తనంతో కకావికలమైన పార్టీ పరిస్థితి.. కవితే పెద్ద దిక్కుగా భావిస్తున్న క్యాడర్‌.. నిజామాబాద్‌ ఎంపీగా బరిలో ఉండాలనే ఆకాంక్ష… జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చి పార్టీకి పూర్వవైభవం తేవాలనే కోరిక… ఇందూరు జిల్లాలో తలోదిక్కుగా మారిన పార్టీ… కవితే ఇప్పుడు ఇందూరు ఇంటికి పెద్ద దిక్కని భావిస్తున్న నాయకులు, కార్యకర్తలు..

( దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: ) కాలం మారింది. మార్పు కాటేసింది. ఒకప్పుడు పరపతి. ఇప్పుడు అథోగతి. మొన్నటి దాకా మాటే శాసనం. ఇప్పుడు ముఖమే బంగారం. ఎవరూ పత్తాకు లేరు. పార్టీ అంతా కకావిలకం. అసెంబ్లీ ఎన్నికల ఫలితం…

ఈరవత్రికి ఎమ్మెల్సీ…. అధిష్టానం సంకేతం.. విధేయతకు అనిల్‌కు ఇచ్చే గిఫ్ట్‌….

దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: ఈరవత్రి అనిల్‌. బీసీ నేత. జిల్లాలో ఎక్కువ సామాజికవర్గం ఉన్న పద్మశాలి వర్గానికి చెందినవాడు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఆ తరువాత అంతా రాజకీయ శూన్యత…

షాడో ఎమ్మెల్యేలు.. ఆర్మూర్‌, అర్బన్‌కు అర్వింద్‌.. బోధన్‌లో శరత్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌లో మండవ వెంకటేశ్వరరావు.. పేరుకు ఎమ్మెల్యేలే కానీ.. పెత్తనం వీరిదే.. ఇందూరు రాజకీయాల్లో ఇదో వింత పరిస్థితి..

(దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి) ఇందూరు ఓటరు విలక్షణ తీర్పునిచ్చాడు. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కటి మాత్రమే బీఆరెస్‌కు ఇచ్చి మిగిలినవి చెరో రెండు పంచుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. బాల్కొండ మాత్రం బీఆరెస్‌కు అత్తెసరు మెజారిటీతో గెలిపించింది. ఆర్మూర్‌లో…