దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

ఆనాడు కేసీఆర్‌ సీఎంగా అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో నిర్వహించి మొత్తం డేటా సేకరించాడు. సేమ్‌ అదే తరహాలో కొన్నిరోజుల పాటు సమయం తీసుకుని రేవంత్‌ సర్కార్‌ ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. ఈ ప్రక్రియాలో అధికారికంగా ఉన్న కుటుంబాలకు అదనంగా 57, 808 ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి… అంటే ఈ కుటుంబాలు అదనంగా ఏర్పడ్డాయి. తల్లిదండ్రుల నుంచి వేరు పడటం, కొత్తగా వివహాలు చేసుకుని తమకు తాము వేరుగా ఉండి బతకడం లాంటి చర్యలతో పాటు ప్రభుత్వం కొత్తగా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నందున అప్పటి వరకు కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు కూడా వేరయ్యాయి.

గత ప్రభుత్వం రేషన్‌కార్డులు ఎప్పటికప్పుడు జారీ చేస్తే వాస్తవానికి ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చేది. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో తాము వేరు కుంపటి పెట్టివ వివరాలు గవర్నమెంటుకు సమర్పించడం ద్వారా వేర్వేరుగా కుటుంబ సభ్యులకు మేలు జరుగుతందని భావించి అదే విధంగా వివరాలు అందించారు. అధికారులు సేకరికంచారు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 4, 20, 00 కుటుంబాలు ఉన్నాయి. కానీ శనివారంతో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ తర్వాత వచ్చిన ఆర్జీల సంఖ్య 4, 77, 808 వచ్చాయి. అంటే అదనంగా 57, 808 మంది వేరు కుంపట్టు పెట్టారు. తమకు తాము స్వయంగా కొత్త పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రేషన్‌కార్డులకు కూడా ఆర్జీలు పెట్టుకున్నారు.

You missed