Category: Political Gossips

అక్క రాక.. ఉత్కంఠ‌కు తెర‌..! ఢిల్లీ చేరుకున్న బీఆరెస్ నేత‌లు..!! నేడు క‌విత బెయిల్‌పై కీల‌క వాద‌న‌లు.. బెయిల్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఢిల్లీ వెళ్లిన ముఖ్య నాయ‌కులు.. ఆమె రాక కోసం ఎదురుచూస్త‌న్నామంటూ సోష‌ల్ మీడియాలో జాగృతి పోస్టింగులు..

(దండుగుల శ్రీ‌నివాస్) క‌విత కోసం అంతా ఢిల్లీ బాట ప‌ట్టారు. ముఖ్య నేత‌లంగా ఇప్పుడు ఢిల్లీలో మ‌కాం పెట్టారు. మంగ‌ళ‌వారం క‌విత బెయిల్ పై కీల‌క వాద‌న‌లున్న నేప‌థ్యంలో ఆమెకు త‌ప్పుకుండా బెయిల్ వ‌స్తుంద‌నే ఆశ‌లో బీఆరెస్ నేత‌లున్నారు. కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌తో…

పులి మీద స్వారీ… ! వెనుక‌డుగు వేస్తే బ‌లే..! రేవంత్ పీక‌ల మీద ఇప్పుడు రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు.. ! రైతు రుణ‌మాఫీ సంపూర్ణం కావాలె…! హైడ్రా కూల్చివేత‌లు కంటిన్యూ చేయాలె..!! సాధ్య‌మ‌వుతుందా..? చేస్తాడా.. చ‌తికిల‌బ‌డ‌తాడా..?? ఏరికోరి రిస్క్‌ను ఎంచుకున్న సీఎం.. వెనుదిరిగితే అంతే సంగ‌తులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రిస్క్‌లో ఉన్నాడు. తెలిసి చేశాడో తెలియ‌క చేశాడో తెలియ‌దు. కానీ రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను త‌న మెడుకు చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా త‌నే చేసుకున్నాడు. ఇదంతా స్వ‌యంకృతాప‌రాధ‌మే. రైతు రుణ‌మాఫీ విష‌యంలో రేవంత్ తీసుకున్న స్టెప్…

కేటీఆర్ నోటికి హైడ్రా తాళం..! నాగార్జున అక్ర‌మ‌క‌ట్ట‌డం కూల్చివేత‌తో బీఆరెస్ ష‌ట్ అప్‌..!! అప్పుడు క‌ళ్లు మూసుకుని.. ఇప్పుడు పేర్లు బ‌య‌ట‌పెట్టి… అధికారంలో ఉండ‌గా అంట‌కాగి… త‌న‌ దాకా రాగానే కేటీఆర్ గ‌గ్గోలు.. ఇక ఫామ్ హౌజ్ ల వంతు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) గురుతులు చెరిపేయ‌డం అంటే ఇదే కాబోలు.. కేసీఆర్ గుర్తులే లేకుండా చేస్తాన‌న్నాడు రేవంత్‌. ఆ పాల‌న‌లో సాగిన తీరుకు భిన్నంగా పూర్తి విరుద్ధంగా పోవ‌డమే త‌న విధానంగా పెట్టుకున్నాడు ఈ సీఎం. అది పాలన‌లోనే కాదు సంస్క‌ర‌ణ‌లో కూడా…

కేసీఆర్‌తో కానిది రేవంత్‌తో అయిందిలా..! నాగార్జున అక్ర‌మ‌క‌ట్ట‌డం నేల‌పాలు..!! ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేసిన హైడ్రా అనుమానాలకు స‌మాధాన‌మా..? ఇక ఇదే వేగం కొన‌సాగేనా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌కు రెండు నాలుక‌లు. డౌటే లేదు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక‌తీరు. ఆ త‌రువాత మ‌రోలెక్క‌. పొగిడిన నోటితోనే ఆ వెంట‌నే తెగ‌డ‌గ‌ల‌డు కూడా. ఏ మాత్రం సంకోచించ‌కుండా. నిల‌క‌డ లేదు. నిబ‌ద్ద‌త అస‌లే లేదు. ఇప్పుడివ‌న్నీ ఎందుకంటే ..…

అన్నీ అవే తాను ముక్క‌లు..! నేత‌ల‌ ఫామ్‌హౌజ్‌లు..!! బ‌డానేత‌ల ఫామ్‌హౌజ‌ల‌న్నీ అక్ర‌మ‌నిర్మాణాలే.. గుమ్మ‌డికాయ‌ల దొంగ‌ల్లా భుజాల త‌డుముకుంటున్న వైనం.. కేటీఆర్‌, పొంగులేటి, కేవీపీ, గ‌డ్డం వివేక్‌, మ‌ధుయాష్కీ, ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్లు బ‌య‌ట‌కు.. ఇంకా చోటామోటా లీడ‌ర్లవి చాలానే.. ఒక‌రిపై ఒక‌రు విస‌ర్లు, కౌంట‌ర్లు… చివ‌ర‌కు ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్‌చుప్‌..! అంతే..!! అప్ప‌టి వ‌ర‌కు *హైడ్రా*మాలే..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడు నేత‌ల ఫామ్‌హౌజ్‌ల లొల్లి న‌డుస్తోంది. హైద‌రాబాద్ చుట్టుప‌క్కల భూముల‌న్నీ బంగారుబాతు గుడ్లే. ఈ నేత ఆ నేత అని కాదు.. అధికారంలో ఎవ‌రుంటూ వారు బ‌ఫ‌ర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్ భూముల అన్ని చుట్టేశారు. నేత‌ల కబ్జాల కౌగిల‌లో కలిసిపోయాయి.…

కాంగ్రెస్ భిక్ష‌తో ఎమ్మెల్సీ అయిన కోదండ‌రామ్‌… మీరు ప్ర‌జా మ‌నిషి ఎట్ల‌యితారు..? నిరుద్యోగం, రైతు రుణ‌మాఫీ పై నోరువిప్ప‌లేదెందుకు..?? ఇన్నాళ్ల మీ పోరాటం ఈ ఎమ్మెల్సీ కోస‌మేనా..??

వాస్త‌వం – హైద‌రాబాద్‌: ఎమ్మెల్సీ కోదండ‌రామ్ రెడ్డిపై సోష‌ల్ మీడియాలో ఓ సెక్ష‌న్ దుమ్మెత్తిపోయ‌డం షురూ చేసింది. త‌ను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని, త‌న‌కు గ‌న్‌మెన్లు వ‌ద్ద‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీన్ని సాకుగా చేసుకుని చాలా మంది నెటిజ‌న్లు ఆయ‌న‌పై సెటైర్లు…

రోడ్డెక్కిన రైతుల ఆశ‌లు..! అయిన‌ను పోయిరావ‌లె హ‌స్తిన‌కు..!! రేవంత్‌కు ప‌ట్ట‌ని రైతుల గోస‌.. ఇంత‌కు మించిన ఇంపార్టెంట్ ప‌నులు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయిగా మ‌రి..! అర్థం చేసుకోరూ….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రైతులు రోడ్డెక్కారు.. ! కాంగ్రెస్‌పై ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతున్నారు. రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ ఏదీ అంటూ నిల‌దీస్తున్నారు. పంద్రాగ‌స్టు నాటికి సంపూర్ణంగా రైతురుణ మాఫీ చేశాన‌ని బాహాటంగా గ‌ర్వంగా ప్ర‌క‌టించి ఆపై ఇక నాకేం సంబంధం లేద‌నే విధంగా సీఎం…

పీసీసీ చీఫ్ రేసులో అడ్లూరి..! అనూహ్యంగా తెర‌పైకి ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే ల‌క్ష్మ‌ణ్ కుమార్‌..!! మాదిగ సామాజిక‌వ‌ర్గానికి ఇప్పించేందుకు ట్రై చేస్తున్న సీఎం.. జీవ‌న్‌రెడ్డికి అనుంగు అనుచ‌రుడు అడ్లూరి..! ఇద్ద‌రు గౌడ్ల మ‌ధ్య ఇంకా పోటాపోటీ…!!

(దండుగుల శ్రీ‌నివాస్) పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం పోటీ పెరుగుతున్న‌ది. అనూహ్యంగా రోజుకో ట‌ర్న్ తీసుకుంటున్న‌దీ వ్య‌వ‌హారం. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటు పీసీసీ చీఫ్ నియామ‌కం కూడా పెండింగ్‌లో ప‌డుతూ వ‌స్తోంది. కాగా గురువారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ల‌నున్నారు.…

ల‌క్ష్మీపుత్రుడి మెడ‌లో రైతుర‌ణ హారం.. ! రుణ‌మాఫీ లేదు.. రైతుబంధు రాదు..!! కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైతుల దీన‌స్థితి.. మ‌న పోచారం ఏమి స‌ల‌హాలిస్తారో..? రైతుప‌క్ష‌మా..? రేవంత్ వ‌శ‌మా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఈ పెద్దాయ‌న‌ను ముద్దుగా ల‌క్ష్మీపుత్రుడు అని పిలుచుకునేవాడు. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌ట్నుంచి తాను ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ‌సంక్షేమ ప‌థ‌కాలు స‌మృద్ధిగా అమ‌లు జ‌రిగాయ‌ని కేసీఆర్ భావ‌న‌. రైతులంతా సుభిక్షంగా ఉన్నార‌ని అనుకుంటుండే వాడు.…

రేవంత్ మెడ‌కు రుణ‌మాఫీ *డెడ్‌*లైన్‌! గిరిగీసి బరిలోకి దిగి .. రైతుల ఆగ్ర‌హాన్ని చ‌విచూసి.. !! ఎంపీ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం పంద్రాగ‌స్టు గ‌డువు ..! ఆంక్ష‌ల‌తో అమ‌లు… తీర‌ని రుణం.. రోడ్డెక్కిన రైత‌న్నల‌పై కేసులు..

(దండుగుల శ్రీ‌నివాస్) ఎంపీ ఎన్నిక‌ల వేళ ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే త‌న‌కు అంత ప‌తారా ఉంట‌దనుకున్నాడు. ఢిల్లీ పెద్ద‌ల ద‌గ్గ‌ర త‌న ప‌ర‌ప‌తి మ‌రింత పెంచుకోవ‌చ్చ‌నుకున్నాడు. సీఎం సీటు ప‌దికాలాల పాటు ప‌దిలంగా ఉంచుకోవాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి…