(దండుగుల శ్రీనివాస్)
కవిత కోసం అంతా ఢిల్లీ బాట పట్టారు. ముఖ్య నేతలంగా ఇప్పుడు ఢిల్లీలో మకాం పెట్టారు. మంగళవారం కవిత బెయిల్ పై కీలక వాదనలున్న నేపథ్యంలో ఆమెకు తప్పుకుండా బెయిల్ వస్తుందనే ఆశలో బీఆరెస్ నేతలున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు నిజామాబాద్ జిల్లా నేతలు, రాష్ట్ర ముఖ్య నేతలంతా సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె తీహార్ జైలులో ఐదు నెలలుగా ఉంటున్నారు. మధ్యలో ఆమె ఆరోగ్యం విషమించింది. బీపీ వచ్చింది. టాబ్లెట్స్ వేసుకుంటున్నది. ఇటీవలే ఆమె పలు కాంప్లికేషన్స్‌తో ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని మళ్లీ జైలుకు వెళ్లారు. బరువు చాలా తగ్గింది.
ఈ కేసులో పలువురికి బెయిల్ దొరికిన నేపథ్యంలో ఆమెకూ ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇదే కోణంలో బీఆరెస్ తరుపు న్యాయవాదులు వాదించనున్నారు. అన్ని అనుకున్నట్టే జరిగితే ఆమె మంగళ, బుధ వారాల్లో బెయిల్‌పై బటయకు వచ్చే చాన్స్ ఉందని బీఆరెస్ కీలక నేత ఒకరు చెప్పారు. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నామంటూ సోమవారం సోషల్ మీడియాలో జాగృతి పోస్టింగులు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.