(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్‌కు రెండు నాలుకలు. డౌటే లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకతీరు. ఆ తరువాత మరోలెక్క. పొగిడిన నోటితోనే ఆ వెంటనే తెగడగలడు కూడా. ఏ మాత్రం సంకోచించకుండా. నిలకడ లేదు. నిబద్దత అసలే లేదు. ఇప్పుడివన్నీ ఎందుకంటే .. తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్లనందరినీ రాక్షసులుగా అభివర్ణించిన నోటితోనే ఆ తరువాత వారి కాళ్లలో ముల్లు గుచ్చితే నోటితో తీస్తానన్నాడు.
అక్రమ కట్టడాల విషయానికొస్తే హీరో నాగార్జున ఎన్ ఎన్వెన్షన్ పూర్తిగా చెరువులో కట్టిందే. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్‌కు తెలుసు. కానీ వదిలేశారు. ఈ హీరోదే కాదు చాలా మంది నేతల అక్రమాలను, అక్రమార్కులను తల్లికోడిలా తన కింద పెట్టుకుని కాపాడుకున్నాడు. ఇప్పుడు రేవంత్ టైం వచ్చింది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ వంతు వచ్చింది. అదిప్పుడు నేలమట్టమయ్యింది. అంతా అవాక్కయ్యారు.
కేసీఆర్ చేయని పని రేవంత్ చేస్తున్నాడంటున్నారు. రాజకీయ కక్షలు, ప్రతీకారాలు, పగసాధింపులు లేకుండా అందరినీ ఒకే గాటన కట్టి ఈ చర్యలా..? అయితే ఓకే..? సర్వామోదం ఉంటుంది. బహుబాగంటారు. కాన మధ్యలో వీటిని ఆపావో. నువ్వూ ఓ కేసీయారే. ఫక్తు రాజకీయ నాయకుడివే. ఇప్పుడు రేవంత్ ఈ విషయంలో పులి మీద స్వారీ చేస్తన్నాడు.