వాస్త‌వం – హైద‌రాబాద్‌:

ఎమ్మెల్సీ కోదండ‌రామ్ రెడ్డిపై సోష‌ల్ మీడియాలో ఓ సెక్ష‌న్ దుమ్మెత్తిపోయ‌డం షురూ చేసింది. త‌ను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని, త‌న‌కు గ‌న్‌మెన్లు వ‌ద్ద‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీన్ని సాకుగా చేసుకుని చాలా మంది నెటిజ‌న్లు ఆయ‌న‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇందులో బీఆరెస్ అభిమానులు కూడా ఉన్నారు. మీరొక్క‌రే ప్ర‌జ‌ల మ‌నిషా..? మంత్రులు, ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల మ‌నిషులు కారా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నదీ పోస్టు…!

 

కొండదరాం గారు ఎందుకీ కపట నాటకం?

1)నాకు సెక్యూరిటీ వద్దు అని కోదండరాం గారు చెప్పడం ఆయన వ్యక్తిగత అంశం.

2) నేను ప్రజల మనిషిని కాబట్టి నాకు గన్ మెన్లు వద్దు అనడం హాస్యాస్పదం. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజల మనుషులు కాదు అని ఆయన అభిప్రాయమూ?

3)తెలంగాణ జన సమితి పేరిట మీ పార్టీ టికెట్ మీద 2018 లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవని మీరు ప్రజల మనిషి ఎట్లా అయితారు?

4) గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే మూడవ స్థానం లో ఉండి, తీన్మార్ మల్లన్న కంటే తక్కువ ఓట్లు సాధించిన మీరు ప్రజల మనీషా??

5) గవర్నర్ కోటాలో కాంగ్రెస్ భిక్ష తో MLC అయిన కోదండరాం గారు, మీరు ప్రజా మనిషి ఎట్లా అయితరు?

6)నిరుద్యోగ యువత ఆందోళన చేసినప్పుడు, రైతుల రుణ మాఫీ సంపూర్ణంగా కానప్పుడు పెదవి విప్పని మీరు ప్రజల మనిషి అని చెప్పుకోవడం సిగ్గు చేటు?

7) ప్రొఫెసర్ నీ మేధావి నీ, రాజనీతి కొవిదున్ని అని చెప్పుకునే నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కాంగ్రెస్ అధికారం లోకి రాకముందు తెలియవా? ఒక జాతీయ పార్టీ అలవి కానీ హామీలు అధికారం లోకి రావడానికి ఇస్తే, దాన్ని సమర్థించిన నువ్వు మేధావి వా?

8)రాష్ట్రానికి ఉన్న అప్పుల గూర్చి మాట్లాడే మీరు ఏనాడూ తెలంగాణ లో పెరిగిన తలసరి ఆదాయం, పెరిగిన రాష్ట్ర ఆదాయం, పెరిగిన ఉపాధి అవకాశాలు,జరిగిన అభివృద్ధి, కేంద్ర సంస్థలు రాష్ట్రానికి ఇచ్చిన కితాబుల గూర్చి ఒక్క రోజైన మాట్లాడారా??

9) కోదండరాం గారు మీ “రెడ్డి దొర” అహంకారాన్ని ఇన్ని రోజులు స్వతంత్ర మేధావి అనే ముసుగు లో కప్పి పెట్టిన మీ ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.

10) మీరు పోరాటం పేరిట ఇన్నాళ్ళ చేసిన నాటకం కేవలం ఒక MLC పదవి కొరకే అని స్పష్టం అయ్యింది.

11)ప్రజా సమస్యల పై మీ నోరు మంత్రి పదవి గూర్చి మూత పడ్డది అని యావత్ తెలంగాణ భావిస్తున్నది.

12) మీరు కోరుకున్న పదవులు కేసిఆర్ గారు ఇవ్వలేదు కనుక, మీ “రెడ్డి దురహంకారం” తో ఇన్నాళ్లు మీరు BRS పాలన మీద విషం చిమ్మారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు.

13) ఇప్పుడు మీ పదవి కాంక్ష నెరవేరడం తో ఇక ప్రజలు మీకు పట్టరు. అంతే కదా MLC కోదండరాం రెడ్డి గారు.

Raju Arige

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed