Category: Local News

మేయ‌ర్‌ను నిల‌బెట్టి.. మంత్రి స‌మీక్ష‌…! ఇదీ కాంగ్రెస్ మార్క్ పాల‌న‌..! ఇందూరులో న‌గ‌ర ప్ర‌థ‌మ పౌరురాలికి అవ‌మానం.. ఆమె బీఆరెస్‌లో ఉండ‌టం కార‌ణ‌మా..?

వాస్తవం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: చాన్నాళ్ల త‌ర్వాత వ‌చ్చాడు ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. ఆయ‌న కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రారంభోత్స‌వాలు చేయాలంటే ఆయ‌నే రావాలి మ‌రి. ఇది ఇందూరు అదేనండీ నిజామాబాద్ ముచ్చ‌ట‌. ఇక్క‌డ మంత్రి లేడు. సుద‌ర్శ‌న్‌రెడ్డి షాడో…

ఎదిగి ఒదిగారు.. క‌నిపెంచిన‌ తండాకు పెద్ద‌దిక్క‌య్యారు..!! ఉద్యోగులంతా క‌లిసి మాతా దేవాల‌యం ఏర్పాటు..! న‌వ‌రాత్రుల మ‌హోత్స‌వానికి ఆహ్వానం ప‌లికిన తౌర్య‌తండా వాసులు..!!

(Dandugula Srinivas) పుట్టిన ఊరును మ‌రిచిపోలేదు వారంతా. చిన్న‌ప్ప‌ట్నుంచి క‌ష్ట‌ప‌డి స‌ర్కార్ చ‌దువులు చ‌దివిన వారికి ఆ తండా త‌ల్లిలా పెంచింది. అక్క‌డే పెరిగారు. పెద్ద‌వార‌య్యారు. స‌ర్కార్ ఉద్యోగాలూ సంపాదించారు. ప్ర‌తీ ద‌స‌రాకు ఆ తండాకు వ‌చ్చి పండుగ చేసుకుంటారు. క‌లుసుకుని…

కోపం న‌శాలానికి… ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి….! విరుచుకుప‌డుతున్నాడు..! ఎవ‌డైతే నాకేంటీ…! ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ కు ఏమైంది…??

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: లేక లేక ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ప‌ట్టించుకునేవాడు లేడు. అటు అధికారులూ ప్రొటోకాల్ పాటించ‌రు. క‌లెక్ట‌రూ చెప్పిన మాట విన‌డు. ప్రారంభోత్స‌వాలు చేద్దామ‌న్నా ఇంచార్జి మంత్రి రావాలంటారు..? ఇదేందిరా బై..! ఎమ్మెల్యే అయితే…

ఆకుప‌చ్చ కండువా @ రైతునేత‌.. ! చెప్పుల్లేకుండా నిర‌స‌న‌, పాద‌యాత్ర‌.. !! రైతుకు కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌.. ముత్యాల మ‌నోహర్ రెడ్డి ఇక‌లేరు..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఆకుప‌చ్చ కండువాను చూడ‌గానే ఆయ‌నే గుర్తొస్తాడు. ఆ కండువా వేసుకున్నాడంటే అత‌ను రైతుగా గుర్తించ‌బ‌డ‌తాడు. ఆ కండువాను వెలుగులోకి తీసుకొచ్చి రైతుబ్రాండ్ క‌ల్పించింది ముత్యాల మ‌నోహ‌రెడ్డి. రైతు నేత‌గా జాతీయ స్థాయిలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త…

బాన్సువాడ ఇసుక మాఫియా..! అధికార‌పార్టీ నేత‌ల దందా.. పోలీసులు అండాదండా.. !! ఫిర్యాదు చేసిన విలేక‌రిని అవ‌మానించిన రుద్రూర్ పోలీసులు..(ఆడియో వైర‌ల్‌) ! మంజీరాను తోడేస్తున్నా కాబోయే మంత్రి సైలెంట్‌..! అప్పుడు బీఆరెస్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌… పార్టీ మారి ఇసుక ర‌వాణాను చెర‌బ‌ట్టి..

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు ఇసుక దందా ఓ బంగారుబాతు. అదే కోట్లు ఆర్జించిపెట్టే అక్ష‌య‌పాత్ర‌. అందుకే దీని కోసం పార్టీలు కూడా మారుతారు నేత‌లు. అధికార పార్టీ ఉంటే ఎవ‌రూ అడ్డు చెప్ప‌ర‌నే ధీమా. అడ్డొచ్చిన వారిని…

హ‌త్యాచారాలు ఎదుర్కోవాలంటే శారీర‌క‌, మాన‌సిక ధృఢ‌త్వంతో ఉండాలి.. ! మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, రాజ్యాంగంపై జేవీవీ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా పాలటెక్నిక్ కాలేజ్ లో మహిళా పై అత్యాచారాలు, భారత రాజ్యాంగం పై అవగాహనా కార్యక్రమం జరిగింది.వక్తలుగా విచ్చేసిన రసూల్ బీ, నర్రా రామారావు లు ప్రసంగించారు చిన్న, పెద్ద…

ఇందూరులో మిశ్ర‌మ స్పంద‌న‌..! క‌విత బెయిల్ నేప‌థ్యంలో పెద్దగా స్పందించ‌ని బీఆరెస్ నేత‌లు.. !! జిల్లాపై ప‌ట్టుకోల్పోయిన ఎమ్మెల్సీ క‌విత‌….! నాడు ఎమ్మెల్యేల‌దే రాజ్యం.. నిజ‌మైన కార్య‌క‌ర్త‌లు,నాయ‌కుల‌ను చేర‌దీయ‌ని ఎమ్మెల్సీ..!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఇంట గెలిచి రచ్చ గెల‌వాలంటారు. కానీ ఎమ్మెల్సీ క‌విత ఇంట‌నే ఓడింది. పార్టీ నాయ‌కుల‌ను, నిజమైన కార్య‌క‌ర్త‌ల‌ను, ఉద్య‌మ‌కారుల‌ను విస్మ‌రించింది. అందుకే ఆమెకు బెయిల్ వ‌చ్చినా జిల్లా బీఆరెస్‌లో పెద్ద‌గా స్పంద‌న క‌రువ‌య్యింది. మొక్కుబ‌డిగా ఓ…

బాల్కొండ బాధ్య‌త‌లు ఈర‌వ‌త్రికి..! ఇక నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టాల‌ని సీఎం రేవంత్ సూచ‌న‌..!! ఇక సునీల్‌రెడ్డి డ‌మ్మీ..! నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతంచేసే దిశ‌గా ఈర‌వ‌త్రి అడుగులు..

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు రాష్ట్ర మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఈర‌వ‌త్రి అనిల్‌కు అప్ప‌గించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక‌పై ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి ముత్యాల సునీల్‌రెడ్డి డ‌మ్మీకానున్నారు. ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది…

ఇందూరు *జెండా* ఈర‌వత్రికి..! పంద్రాగ‌స్టు వేడుక‌ల కోసం అనిల్‌కు అవ‌కాశం ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. !! అనూహ్యంగా తెర‌పైకి అనిల్ పేరు.. ష‌బ్బీర్ అలీని నిజామాబాద్, కామారెడ్డిల‌కు దూరం చేసిన సీఎం.. ఆదిలాబాద్‌కు ముఖ్య అతిథిగా అలీ..

వాస్త‌వం ప్ర‌తినిది- నిజామాబాద్: నిజామాబాద్ పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఈర‌వ‌త్రి అనిల్ పేరును సూచించారు సీఎం ర‌వేంత్‌రెడ్డి. ఇది అనూహ్య ప‌రిణామం. మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డికి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా కేబినెట్‌లో…

పెంచిపోషించిన నేత‌లు..! న‌రేంద‌ర్ అక్ర‌మాస్తుల వెనుక అంద‌రి హ‌స్తం..!! ప‌దేళ్లుగా అందుకే ఇందూరు మున్సిపాలిటీలో తిష్ట‌.. బైపాస్ వ‌ద్ద రెండెక‌రాల భూమి కొనుగోలు కోసం పెద్ద ఎత్తున డ‌బ్బు తెచ్చి పెట్టుకున్న న‌రేంద‌ర్‌.. కొనుగోలు విష‌యంలో గొడ‌వ‌.. ఫిర్యాదు చేసిన పోటీదారు.. కొంప ముంచిన అత్యాశ‌.. అంద‌రూ తోడున్నార‌నే మితిమీరిన విశ్వాసం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అత‌డు అంత‌లా అక్ర‌మాస్తుల‌కు ఎగ‌బాగాడంటే నేతల అండ లేకుండానేనా..! అస్స‌లు సాధ్యం కాదు. ఈ న‌రేంద‌రుడి క‌థ‌లోనూ ఇదే మెలిక ఉంది. కానీ అంత‌కు మించి ఇంకా ఉంది. అదేంటో తెలుసా..? ఇత‌నికి ఒక్క‌రు కాదు అంద‌రూ నేస్తాలే.…