వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌:

లేక లేక ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ప‌ట్టించుకునేవాడు లేడు. అటు అధికారులూ ప్రొటోకాల్ పాటించ‌రు. క‌లెక్ట‌రూ చెప్పిన మాట విన‌డు. ప్రారంభోత్స‌వాలు చేద్దామ‌న్నా ఇంచార్జి మంత్రి రావాలంటారు..? ఇదేందిరా బై..! ఎమ్మెల్యే అయితే ఏదో చేసేయొచ్చ‌నుకుంటే .. ఏదీ ముంగ‌ట‌ప‌డ‌త‌లేదు. అనుకున్న‌వి అయిత‌లేదు.. ఛ‌ల్ నీ….

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోపం న‌శాలానికంటింది. ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కు వెళ్లింది. అందుకే ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియ‌డం లేదు. విరుచుకుప‌డుతున్నాడు. క‌రిచేస్తున్నాడు. ప్రోగ్రాం ఏదైనా వేదిక మ‌రేదైనా త‌నంతే. ఏమ‌నుకుంటే అది మాట్లాడుతాడు. ఎవ‌రు ఏమీటి… డోంట్‌కేర్‌. ఎవ‌డైతే నాకేంటీ అని ఆగ్ర‌హావేశాలు వెళ్ల‌గ‌క్కుతున్నాడు.

ఎమ్మెల్యే అయి ఏడాది కూడా కాలే.. అప్పుడే అంత ఫ్ర‌స్టేష‌న్ వ‌చ్చేసింది ఈయ‌న‌లో. ఇవాళ నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన స‌మావేశంలో కూడా ఇదే త‌ర‌హా శైలిలో విరుచుకుప‌డ్డాడు. ఇంచార్జి మంత్రి జూప‌ల్లి క్రిష్టారావు పేషీని పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టేస్తాన‌ని నోరు జారాడు. దురుసుగా మాట్లాడాడు. ఇదాయ‌న‌కు అల‌వాటుగా మారింది. గ‌తంలో కూడా హిందువులు గుళ్ల‌కు వెళ్ల‌రు.. వెళ్తే వంద కోరిక‌లు కోరుకుంటారు..అంటూ త‌న వైరాగ్యాన్ని చాటుకున్నాడు.

బీజేపీ ఎమ్మెల్యే కాబ‌ట్టి.. హిందూ, ముస్లిం ల టాపిక్‌ను అసంద‌ర్భంగా కూడా ఎక్క‌డైనా మాట్లాడేయ‌గ‌ల దిట్ట‌. ఫైర్ బ్రాండ్ అంటారంద‌రు. కానీ ఇలా అప్ప‌డ‌ప్పుడు నోరు జార‌డంతో ఆ మాట‌లు మిస్‌ఫైర్ అవుతుంటాయి. ఇప్పుడే సినిమా మొద‌లైంది. ఇంకా నాలుగేళ్లుంది అప్ప‌టి దాకా ఈ మాట‌ల మంట‌ల వ్యాప్తి ఏ రేంజ్‌లో ఉంటుందో మ‌రి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed