వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా పాలటెక్నిక్ కాలేజ్ లో మహిళా పై అత్యాచారాలు, భారత రాజ్యాంగం పై అవగాహనా కార్యక్రమం జరిగింది.వక్తలుగా విచ్చేసిన రసూల్ బీ, నర్రా రామారావు లు ప్రసంగించారు చిన్న, పెద్ద తేడా లేకుండా స్త్రీల పై వివక్షత,అత్యాచారలు ఘోరంగా పెరిగి పోయాయాని వీటినుండి రక్షించుకోవాలంటే మానసికంగా, శారీరకంగా దృడంగా తయారుకావాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్ బీ అన్నారు.
మహిళా చట్టాలు, ఫ్రీ టోల్ నంబర్స్ పట్ల అవగాహనా ఉండాలని వాటి గురించి వివరించారు. Jvv రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహోన్నత మైంది, దీని పీఠిక ఆత్మ లాంటిదని, పీఠిక లోని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, ఘనతంత్ర, అంశాల పట్ల అవగాహన చేస్తూ కుల, మత రహిత సమాజంకోసం రాజ్యాంగ ప్రాతిపాధికన ప్రతీది ప్రశ్నిస్తూ మన న్యాయన్ని, ధర్మాన్ని కాపాడుకునే విధంగా విద్యార్థులు తయారుకావాలన్నారు.దీనికి ముందు రాజ్యాంగం పై ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
Jvv జిల్లా అధ్యక్షులు కోయెడి నర్సింలు మాట్లాడుతూ శాస్రీయ ఆలోచన పెంచుకొని ప్రతీది తెలుసుకొని అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ నరేష్ అధ్యక్షతన జరిగిన దీనిలో వెంకట మల్లయ్య, అనురాధ ఫార్మసీ హెడ్, వీరయ్య, శ్రీనివాస్, శ్రీరాంగౌడ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.