వాస్తవం ప్రతినిది- నిజామాబాద్:
నిజామాబాద్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేరును సూచించారు సీఎం రవేంత్‌రెడ్డి. ఇది అనూహ్య పరిణామం. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కేబినెట్‌లో చోటు దక్కితే ఆయనే ఇక్కడ జెండా ఎగురవేసేవాడు. కానీ అది ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఆయనకు ఈసారీ నిరాశ తప్పలేదు.
అయితే ఎవరికి ఈ చాన్స్ దక్కుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరకు ఎవరికీ అంతు చిక్కని విధంగా ఈరవత్రి అనిల్ పేరును ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ ర్యాంకు కూడా లేని అనిల్ పేరు తెరమీదకు రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇది ముత్యాల సునీల్ అండ్ టీమ్‌కు మింగుడు పడని అంశం.
మరోవైపు కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీకి అవకాశం ఇస్తారని భావించారు. నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జిగా షబ్బీర్ కొనసాగుతున్నాడు. ఇక్కడ అవకాశం ఇవ్వక తన సొంత నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో అవకాశం ఇవ్వక ఆదిలాబాద్‌కు పంపాడు రేవంత్. ఈ రెండు పరిణామాలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.