వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
బాన్సువాడ నియోజకవర్గ నేతలకు ఇసుక దందా ఓ బంగారుబాతు. అదే కోట్లు ఆర్జించిపెట్టే అక్షయపాత్ర. అందుకే దీని కోసం పార్టీలు కూడా మారుతారు నేతలు. అధికార పార్టీ ఉంటే ఎవరూ అడ్డు చెప్పరనే ధీమా. అడ్డొచ్చిన వారిని పోలీసుల సాయంతో బెదిరించొచ్చు. దాడులు చేసినా అడిగేనాథుడు ఉండడు. అలా మూడు టిప్పర్లు, ఆరు లారీలుగా ఇది యథేచ్చగా సాగుతూనే ఉంది.
ఇదంతా అందరికీ తెలిసిన కథే. బాన్సువాడ లో ఏం జరుగుతుంది..? నేతలెవ్వరో .. పార్టీ మారిందెవరో విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విషయమేమిటంటే.. ఓ విలేకరి ఈ ఇసుక మాఫియా గురించి డయల్ 100కు ఫోన్ చేశాడు. రుద్రూరు పోలీసు లైన్లోకి వచ్చాడు. ఆ పోలీసు మాట్లాడిన తీరు.. వెటకారం తీవ్ర అవమానకరంగానే ఉన్నాయి. ఫిర్యాదు చేసింది విలేకరే కానవసరం లేదు. కామన్ పీపుల్ కాల్‌చేసినా స్పందించాలి.
(ఆడియో కాల్ గురించి vastavam tv చూడండి..)
కానీ ఆ పోలీసు ఆ విలేకరితో ఆడుకున్నాడు. నీకు ఐడీ ఉందా..? నువ్వో పెద్ద న్యూసెన్స్ గాడివంట కదా.. అంటూ ఏవేవో తన పరిధి దాటి మాట్లాడి అవమానించాడు. దీన్ని బట్టి ఇసుక మాఫియాకు పోలీసులు అండదండ ఎలా ఉందో తెలిసిపోతున్నది. మంజీరాను తోడేస్తున్నా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాబోయే హోం మంత్రి మాత్రం పట్టించుకోడు. ఎందుకంటే ఆ ఇసుక మాఫియాలో ఉన్న తమ పార్టీలోని నేతలే మరి.