వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
బాల్కొండ నియోజకవర్గ బాధ్యతలు రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కు అప్పగించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్‌రెడ్డి డమ్మీకానున్నారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తరువాత ఓటమిని చవిచూసిన ఈరవత్రి.. రేవంత్‌రెడ్డి సూచన మేరకు బాల్కొండ నియోజకవర్గాన్ని ముత్యాల సునీల్‌రెడ్డికి త్యాగం చేశారు.
కానీ సునీల్‌రెడ్డికి ఆ తరువాత క్రమంలో అందరినీ కలుపుకుని పోలేదు. తాను ఎలాగైనా గెలుస్తాననే గర్వంతో పోవడంతో ఓటమిపాలయ్యాడు. ఆ తరువాత సీఎం రేవంత్‌రెడ్డి ఇదే నియోజవకర్గం నుంచి ఈరవత్రి అనిల్‌తో పాటు, నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, కిసాన్ ఖేత్ నాయకుడు అన్వేష్‌రెడ్డిలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అప్పట్నుంచి సునీల్ నియోజకవర్గంతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. తాజాగా నిజామాబాద్ పంద్రాగస్టు వేడుకులకు అనిల్‌ను ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు.
ఈ పరిణామం సునీల్‌రెడ్డి అండ్ టీమ్‌లో తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. ఇదే సమయంలో అనిల్ భవిష్యత్తులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయంలో తర్జనభర్జన పడుతున్నాడు. పద్మశాలి వర్గం ఎక్కువగా ఉన్న అర్బన్, ఆర్మూర్ నుంచి కూడా ఆయన పోటీ చేయాలనే డిమాండ్ వచ్చింది. కానీ ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలె అనే చందంగా బాల్కొండలోనే మళ్లీ పోటీ చేసి గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అనిల్‌కు భరోసా కల్పించినట్టు తెలిసింది.