వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్: చాన్నాళ్ల తర్వాత వచ్చాడు ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రారంభోత్సవాలు చేయాలంటే ఆయనే రావాలి మరి. ఇది ఇందూరు అదేనండీ నిజామాబాద్ ముచ్చట. ఇక్కడ మంత్రి లేడు. సుదర్శన్‌రెడ్డి షాడో మంత్రి. కానీ అధికారికంగా ప్రారంభోత్సవాలు చేయలేడు. ఇక కామారెడ్డికి చెందిన షబ్బీర్ అలీ అర్బన్‌లో తెచ్చిపెట్టుకున్న పెబ్బ. అంటే ఆయన పెద్దరికం చేస్తాడు.
ఇక ముచ్చటగా ఈరవత్రి అనిల్ కూడా అర్బన్‌లో పెద్ద మనిషే. ఆయనా కార్యక్రమాలకు హాజరువుతున్నాడు. ఎమ్మెల్సీ , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు కూడా అర్బన్ మీదే దృష్టి. ఇంత మంది కాంగ్రెస్ పెద్దలంతా తమ పెత్తనం కోసం ఇక్కడ పాకులాడుతుంటే ఇక మేయర్ ఎక్కడ కనబడతారు. ఆమెను ఇలా నిలబెట్టే సమీక్ష జరిపాడు మంత్రి జూపల్లి. మేయర్ నీతూ కిరణ్ ఇలా వెనక నిలబడి సమీక్షలో పాల్గొన్నారు. వాళ్లకే సీట్లు సరిపోవు. అందులో మేయర్ బీఆరెస్ పార్టీకి చెందిన లీడర్ మరి. అందుకే ఇలా పట్టించుకోలేదన్నట్టు. అట్లుంటది మరి కాంగ్రెస్ పాలన.