నైజం..!
(కేసీఆర్ మరోకోణం..)
ధారావాహిక -8
……………………..
కొన్నిసార్లు కాలం ఘోరంగా దెబ్బకొట్టింది కేసీఆర్‌ను.
మరికొన్ని సార్లు ఆ కాలమే చేయూతనిచ్చి పైకి లేపింది.
ప్రకృతి కూడా సహకరించబట్టే కేసీఆర్ ఇవాళ ఇంత దాకా వచ్చాడు.
అదంతా తన క్రెడిబిలిటీ, తన మేథావితనమేనని పొరబడ్డాడు. అందుకే అహంకారంగా వ్యవహరించాడు. కళ్లునెత్తికెక్కి నడుచుకున్నాడు. అధికారమదంతో మందబలాన్ని చూసి అదే శాశ్వతమనుకున్నాడు. ఇక తనకు తిరుగులేదనుకున్నాడు.
ప్రకృతినే ధిక్కరించేలా నడుచుకున్నాడు.
కాలాన్ని తన కాళ్లకింద పెట్టుకున్నాననుకున్నాడు.
కాలాంతకుడయ్యాడు. కానీ చేయూతనిచ్చిన ఆ కాలమే.. కాలసర్పమై కాటేసింది.
కాలం చేయూత అంటే అంతే ఇంతా కాదు..
కేసీఆర్‌కు కొత్త ఊపిరినిచ్చింది. ఉద్యమానికి జీవం పోసింది. రాష్ట్ర ఆకాంక్షకు దారులు చూపింది.
…………………………………………………..
రాజశేఖర్‌రెడ్డి కాళ్లు నేలమీద నిలవడం లేదు. తనకెదురేలేదనుకున్నాడు. సేమ్ రెండోసారి కేసీఆర్ సీఎం అయినప్పుటి పరిస్థితి ఆనాటి రాజశేఖర్‌రెడ్డి స్థితి.
కేసీఆర్‌ను ఘోరంగా దెబ్బకొట్టాలనుకున్నాడు. ఎలాగంటే ఇక మరెవ్వడూ తెలంగాణ పేరుతో బయటకు రావొద్దు. తెలంగాణ పేరు బయటకు రావొద్దు. పార్టీలే లేకుండా చేయాలె. విభజనవాదానికి శాశ్వతంగా ఘోరీ కట్టాలి.
అందరినీ లాగడం మొదలు పెట్టాడు.
కీలకమైన వికెట్.. హరీశ్‌రావుపై పడింది రాజశేఖర్‌రెడ్డికి.
ఓ రోజు హరీశ్‌రావు సీఎం రాజశేఖర్‌రెడ్డిని కలిశాడు. అంతా ఇదే చర్చ. టీఆరెస్‌లో ప్రకంపనలు.
ఇక కేసీఆర్‌తో ఉండేదెవ్వరు..? పోయేదెవ్వరు..?
పార్టీ ఉంటుందా..? పోతుందా..??
కేసీఆర్ గతేం కాను..
కేసీఆర్ నే నమ్ముకున్న ఉద్యమకారులంతా కాకవికలమైపోతున్న సందర్భం అది.
ఈ ప్రశ్నలకు, అనుమానాలకు,అవమానాలకు కాలం సమాధానం చెప్పింది.
రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఘోరంగా చనిపోయాడు. అంతే..!
అది యావత్ దేశానికి షాక్.. ఆంధ్రలో పెనుప్రకంపనలు..
తెలంగాణలో మాత్రం పండుగ వాతావరణం.
అవును..! ఓ సమైక్య రాక్షసుడు చచ్చాడు.
పీడ విరగడైంది.
రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఎన్నటికీ తెలంగాణ రాకుండె. తెలంగాణ సంగతటుంచి కేసీఆర్ మట్టికొట్టుకుపోతుండె. పార్టీ, కేసీఆర్ ఇద్దరూ కనుమరుగైపోతుండె.
ఉద్యమానికి మళ్లీ కొత్త ఊపిరి వచ్చింది.
అప్పుడే కేసీఆర్‌లోని మరో మనిషి నిద్రలేచాడు. కాలం అతనికి సిగ్నిల్ ఇచ్చింది.
ఇక ఇంతకు మించిన మంచి తరుణం లేదనుకున్నాడు.
తెలంగాణ వచ్చుడో .. కేసీఆర్ సచ్చుడో… నినాదం అందుకున్నాడు కేసీఆర్.
అదే చరిత్ర గతిని మార్చింది. మరో చరిత్రను లిఖించింది.
(ఇంకా ఉంది)
TO BE CONTINUED…..
Dandugula SRINIVAS
Senior Journalist
8096677451