దండుగుల శ్రీనివాస్- వాస్తవం బ్యూరో చీఫ్:
ఆశిష్ సాంగ్వాన్..కామారెడ్డి కలెక్టర్ ఆయన. నిర్మల్ జిల్లా నుంచి రీసెంట్లీగా ఇక్కడికొచ్చాడు. అప్పటి వరకు ఒక లెక్క.. ఈ సార్ వచ్చినాక ఒక లెక్క. పార్టీలేవైనా, నేతలెంత తీస్మార్‌ఖాన్‌లైనా ఈయన వినడు. ఉహూ ససేమిరా అంటాడు. ఇది చేయండని అనగానే సరే అనే రకం కాదు. సరే చూద్దాం అనే టైపన్నమాట. దీంతో నేతలందరికీ ఈయన వైఖరి మింగుడుపడటం లేదు. వచ్చీరాగానే ఆయన ఎలాంటి వాడో తెలిసిపోయింది నాయకులందరికీ. మాకెందుకు పంపార్రా నాయనా ఈయన్ను అంటూ తల పట్టుకోవడం తప్ప వారిప్పుడు చేసేదేం లేదు.
వచ్చింది మొన్నమొన్ననే కదా. బాన్సువాడ నేతలకు ఇసుక నుంచే మేజర్ ఆదాయం. ఈ ఆదాయం కోసం పార్టీలు మారిన చరిత్ర బాన్సువాడకు ఉంది. అధికార పార్టీలోక అందుకు పోయారు. కానీ ఇక్కడ కలెక్టర్ దగ్గర మాత్రం ఆ హుకుంగిరీ చెల్లడం లేదు వారికి. ఇసుక క్వారీల ఫైళ్లు కలెక్టర్ టేబుల్ మీద నుంచి ముందుకు కదలవు. చెబితే వినాలి కదా అంటారు వాళ్లు. ఎందుకు వినాల అని మొండికేసి వాటిని బండకేసి కొడతాడు ఈయన. ఇదిగో ఇదే తంతు.
బీజేపీ, కాంగ్రెస్ లీడర్లెవరైనా ఈయనకు ఒకటే. డోంట్ కేర్. నా పని నన్ను చేసుకోనివ్వండి. గెలకకండి అనే రకం అన్నమాట. ఇదెక్కడి తలనొప్పిరా నాయన అంటూ లబోదిబోమంటున్నారట కామారెడ్డి ఎమ్మెల్యేలు..