దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం హైదరాబాద్‌ ప్రతినిధి:

ఆయనంతే. సీనియర్‌ లీడర్‌ కానీ పదవుల కోసం ఇలా అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. ఆయనే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసేటప్పుడు ఇవే నాకు లాస్ట్‌ ఎన్నికలు ప్లీజ్‌ గెలిపించండని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశాడు. అయినా ఓడిపోయాడు. మొన్న ఎంపీ ఎన్నికల్లో సీనియర్‌ నేతగా నిజామాబాద్‌ నుంచి అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఓడిపోతానని ఆయనకు ముందే తెలుసు.

అందుకే చివరగా మళ్లీ అదే సెంటిమెంట్‌ అప్లై చేశారు. ప్లీజ్‌ ఇవే నాకు లాస్ట్ ఎన్నికలు జర గెలిపించుండ్రి అని బతిమాలుకున్నాడు. అయినా గెలవలేదు. ఇక జీవన్‌రెడ్డి శకం ముగిసిందని అంతా అనుకుంటున్న సమయంలో.. సంజయ్‌ రూపంలో మరో అరుదైన, అపురూప అవకాశం జీవన్‌రెడ్డికి లభించింది. జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. దీంతో అలకవహించాడు జీవన్‌. రాజీనామా చేస్తానంటూ బీరాలు పలికాడు. అధిష్టానం వద్దకు పంచాయితీ వెళ్లింది.

వారిలో కొందరు ఫోన్‌ చేసి ఊకో ఊకో అని బుజ్జగించారు. కానీ పార్టీ కూడా మారుతానని ఫీలర్‌ వదిలాడు. ఇదెక్కడి పంచాయితీరా నాయన.. అని మరీ బతిమాలారు. చివరగా తెలిసొచ్చిందేందంటే.. నాకూ మంత్రి పదవి కావాలని. అక్కడ ఉన్నోళ్లే తన్నుకు చస్తున్నారు. ఆల్రెడీ సుదర్శన్‌రెడ్డి ఎప్పుడెప్పుడా అని నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మళ్లా జీవన్‌రెడ్డి పోటీకి వస్తే ఊకుంటడా..? అక్కడ అంత సీన్ లేదంటున్నారు సీనియర్లు.

కానీ ప్రచారమైతే మస్తు చేసుకుంటున్నారట జీవన్‌రెడ్డి అనుచరులు… మా సార్ పేరు కూడా లైన్లో ఉంది తెలుసా..? అని పాపం..! అల్పసంతోషులు అంతే. పదవుల కోసం ఆశపడ్డటంలో తప్పులేదంటారా..? కానీ మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed