నైజం..!

(కేసీఆర్‌ మరోకోణం..)

ధారావాహిక-9
…………………………..

‘ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చచ్చిపోయి బతికించాడు గానీ.. తెలంగాణ భవన్‌ను కూడా కబ్జా చేసేందుకు అంతా రెడీ అయ్యింది..’

‘ ఇక రేపోమాపో తెలంగాణ భవన్‌ కూడా లేకుండా పోయేది’

అలాంటిది వైఎస్‌ఆర్‌ సచ్చుడు.. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు, టీఆరెస్‌కు కలిసి వచ్చింది.

కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్‌.

అపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య తీసుకున్న బ్లండర్‌ మిస్టేక్‌ నిర్ణయం మరింత కలిసి వచ్చింది కేసీఆర్‌కు.

అదే కేసీఆర్‌ను అరెస్టు చేయడం…

అవును.. కేసీఆర్‌ను అరెస్టు చేసి జైళ్లు తింపారు. చివరకు నిమ్స్‌కు తరలించారు.

ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున లేపిన సందర్భమది.

ఉస్మానియా మరోసారి అగ్గి బరాటా అయ్యింది. ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు తెలంగాణ సాధించుకోలేమనుకున్నారంతా. అంతా ఒక్కటయ్యారు.

కాలం కేసీఆర్‌కు అనుకూలంగా మారింది.

ఓ వైపు చావుకు దగ్గర పడుతున్నా.. ఉద్యమం ప్రతిఫలాన్నిచ్చే వైపుకు సాగుతున్నది. అది మెల్లగా అర్తమవుతున్నది అందరికీ.

కానీ ఓ టెన్షన్‌. కేసీఆర్ ఉంటాడా..? చస్తాడా..?

అది అందరి మదిలో మెదులుతున్న ఆందోళన.

సోనియా నుంచి పడితే ఉస్మానియా వరకు..

ఢిల్లీ రాజకీయాల నుంచి గల్లీ పోరని వరకు.. అందరిలో ఒక టెన్షన్‌. ఒక ఉత్కంఠ. ఒక ఆశ. ఒక నిరాశ.

ఇదంతా ఇలా కొనసాగుతున్న సమయంలో కీలక మలుపుతిరిగిన సంఘటన ఒకటి జరిగింది.

అది ఉద్యమ పోరాట స్వరూపాన్ని మార్చింది. కొత్త టర్నింగ్‌ తీసుకునేలా చేసింది. ఇక తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు తెచ్చి పెట్టింది.

అదే..

ఎల్బీనగర్‌ వద్ద శ్రీకాంతాచారి బలవన్మరణం. బలిదానం.

తన చావుతోనైనా తెలంగాణ రావాలనుకున్నాడు.

శ్రీకాంతాచారి అమరుడయ్యాడు.

కేసీఆర్‌ను అమరత్వం నుంచి కాపాడాడు.

తన చావు పయనం తెలంగాణ సాకారం దిశగా పోయేలా చేశాడు.

తెలంగాణ ప్రకటించకతప్పలేదు కేంద్రానికి.
…………………………………………………

‘ శ్రీకాంతాచారి అమరత్వం ఆ సమయంలో ఎంతో ఉపయోగపడింది.’

ఇది ఉద్యమ గతినే మలుపుతిప్పింది. ఢిల్లీ పెద్దలకు వణుకుపుట్టించింది. ఉద్యమానికి దివిటిలా పనిచేసి.. ఇక చావో రేవో తేల్చుకునేందుకు సిద్దపడేలా చేసింది.

కానీ కేసీఆర్‌ ఏనాడూ శ్రీకాంతచారి పేరెత్తలేదు. ఆయన తల్లినీ గౌరవించలేదు.

అంతే కేసీఆర్‌ మెంటాలిటీ అంతే.

తన ముందు ఎవరూ ఎదగొద్దు. అలా పడి ఉండాలి.

తను మాత్రం అందరి సమిధలపై నడుచుకుంటూ పార్టీ నిర్మాణం చేసుకుంటాడు. అధికారం కోసం అందరినీ సాలెగూటికి బలి చేస్తాడు.

(ఇంకా ఉంది)

 

to be continued…….

Dandugula Srinivas

Senior Journalist

8096677451

You missed