వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ ఎన్నికలకు ముందు హడావుడిగా కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించాడు. ఇవి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేస్తాయని భావించారు. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈ పదవులు వరించాయి.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డికి సహకార యూనియన్ కార్పొరేషన్, ఈరవత్రి అనిల్‌కు మినలర్ డెవలప్‌మెంట్, అన్వేష్‌రెడ్డికి సీడ్ కార్పొరేషన్ ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీరు అధికారికంగా బాధ్యతలు తీసుకోలేదు. ఖమ్మం, వరంగల్ లాంటి చోట కార్పొరేషన్ పదవులపై వివాదాలు తలెత్తాయి. దీంతో మళ్లీ దీని ఊసులేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చాడు.
కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవులపై క్లారిటీ తీసుకున్నాడు. జిల్లాకు చెందిన ఈ ముగ్గురికి మళ్లీ ఇవే పదవులు వరిస్తాయా..? మ మారుస్తారా..? అనే చర్చ మొదలైంది. సీనియర్ నేత గడుగు గంగాధర్‌కు కూడా జిల్లా నుంచి అవకాశం వస్తుందా ..? అనేది కూడా డిస్కషన్‌లో ఉంది.