వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కనుమూశారు. ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయత్రం వరకు ఆయన మృతదేహాన్ని నిజామాబాద్‌లోని నివాసానికి తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విషయం తెలియగానే పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంకా ఢిల్లీ నుంచి రాలేదు. కాగా కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రిటికల్ సర్జరీ తరువాత డీఎస్ పూర్తిగా తన ఆరోగ్యం పై పట్టు కోల్పోయారు. పలుమార్లు ఆరోగ్యం మరింత విషమించగా ఆస్పత్రిలో అత్యవసర సేవలు అందించి తిరిగి ఇంటికి తీసుకొచ్చి చికిత్సలు అందిస్తున్నారు.
డీఎస్‌ను కుటుంబ సభ్యులు కొంతకాలంగా ఎవరినీ కలవనీయడం లేదు. చివరకు ఇవాళ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని చనిపోవాలన్నది ఆయన అంతిమ కోరికగా చెప్పుకునే వాడు.