వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
మోడీ అనుకున్నది సాధించాడు. ఒక్క దెబ్బకు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ కకావికలం. అత్యుత్సాహంతో, అహంకారంతో కవిత వేసిన రాంగ్ స్టెప్ ఆ కుటుంబానికే కాదు.. ఆ పార్టీని నమ్ముకున్న వారందరినీ ఆగం చేసింది. చెల్లాచెదురు చేసింది. అగమ్యగోచరంలో పడేసింది. దేశానికే నిప్పుపెడతా అని బీఆరెస్ ఏర్పాటు చేసుకుని తనను మించిన వీరుడు లేడని హస్తినాకు బయలుదేరేందుకు సిద్ధమైన కేసీఆర్‌ను తెలంగాణలోనే కట్టడి చేశాడు మోడీ.
కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం మోడీకి అందివచ్చిన ఓ బంగారు చాన్స్. ఇక వదలడం లేదు. వదిలేలా లేడు. కేసీఆర్‌కు ‘సన్’ స్ట్రోక్ తగులుతుందనుకున్నారంతా. కానీ కవిత స్ట్రోక్ తగిలింది. ఇప్పుడు ఆయన మానసికంగా వేదనకు గురవుతున్నాడు. పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శించినా కవిత జైలు పాలుకావడం ఆయన ముందరి కాళ్లకు బంధాలేస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడప్పుడు ఆ పార్టీ, ఆయన, కుటుంబం కోలుకోలోని దుర్బర స్థితిలో ఉన్నారు. కారణం మోడీ.
కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీలో, మనీ లాండరింగ్‌లో దొరికిపోవడం. మాకేమవుతుందిలే.. మాకు మించిన తెలివిపరులున్నారా..? అనే అంహకారం ప్రదర్శించి బోల్తా పడిన వారిలో కవిత, కేటీఆర్, కేసీఆర్…. అంతా ఉన్నారు. కానీ బీఆరెస్ పార్టీనే ఇంకా నమ్ముకుని ఉన్న ఉద్యమకారులు, పార్టీ అభిమానులు వీరి అహంకార ప్రదర్శనకు, నమ్ముకున్న పాపానికి బలిపశువులతున్నారు.
దిల్లీ లిక్కర్ స్కాంలో రెండు సంస్థలు ఎంట్రీ
దిల్లీ లిక్కర్ స్కాం ను కేంద్ర దర్యాప్తు సంస్తలైన ఈడీ, సీబీఐ రెండూ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. అక్రమ మార్గాలలో డబ్బు సంపాదన, మద్యం పాలసీ రూపొందించడంలో జరిగిన అవినీతి పై ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. దిల్లీ లిక్కర్ స్కాం పై మొదట సీబీఐ కేసు నమోదు చేసింది. లిక్కర్ స్కాంలో ఎవరెరున్నారు, కేజ్రీవాల్ పాత్ర ఏమిటనేది దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయి.
వరుసగా కవితకు షాకులు
లిక్కర్ స్కాంలో కవితకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ వాదనలు ఈనెల 20 నుంచి జరగనున్నాయి. తాజాగా సీబీఐ కూడా అరెస్టు చేయడంతో ఇంతలో కవిత బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.