ఐదో తారీఖే ఇక జీతాలు… కొత్త ఏడాది నుంచి ఉద్యోగులకు టంచన్‌గా జీతాలిచ్చేందుకు సర్కార్ యోచన.. ఈ-కుబేర్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న రేవంత్ సర్కార్.. నిధులున్న శాఖల నుంచి అడ్వాన్సులు తీసుకోవడం.. అవసరమైతే ఒక నెల జీతాల కోసం అప్పులు తెచ్చైనా సరే… గతంలో లాగా రొటేషన్ సిస్టం వద్దంటున్న ఉద్యోగులు… రుణాలు తీసుకోకుండా చేసిన సకాలంలోరాని జీతాలు.. ఇకనైనా తమ జీ(వి)తాలు మారుతాయా.. ? అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు..
కేసీఆర్ సర్కార్‌లో ఉద్యోగులు సకాలంలో జీతాలు తీసుకున్నది లేదు. అలవాటైపోయిందలా. ఇగో ఇప్పటికీ రాలే వారికి జీతాలు. ప్రతీనెల టంచన్‌గా చెల్లించే ఈఎంఐలు, పాలు, రెంట్, ఆటో, స్కూల్ రెంట్లకు నానా తంటాలు పడే దురస్థకు అలవాటు పడిపోయారు ఉద్యోగులు. గత…