జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాపై ప్రత్యేక నజర్‌ పెట్టాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు త్వరలో పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇది జిల్లాకు పెద్ద బలం. కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలం. డీఎస్ తర్వత పీసీసీ చీఫ్‌గా అరుదైన అవకాశం మహేశ్ కుమార్‌ గౌడ్‌కు దగ్గనుంది. ఇదే కాదు.. ఇందూరుకు మరో అరుదైన, అద్భుత అవకాశం చేరువలో ఉంది. అదే సుదర్శన్‌ రెడ్డికి హోం మంత్రి పదవి ఖరారు కావడం.

సీఎం రేవంత్‌కు దగ్గర బంధువు, అంకుల్‌ అయిన సుదర్శన్‌రెడ్డికి మొదటి విడత కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు. కానీ రేవంత్‌ మనసులో సుదర్శన్‌ రెడ్డికి కీలకమైన హోం మంత్రి పదవి ఇద్దామని డిసైడ్‌ అయినట్టు తెలిసింది. తొలత ఈ పోర్ట్‌ ఫోలియో సీతక్కకు ఇస్తారనుకున్నారు. కానీ సుదర్శన్‌రెడ్డితో రేవంత్కు మంచి దగ్గర బంధుత్వం ఉంది. దీంతో ఆయనకే ఈ పదవి ఇవ్వాలని సీఎం ఫిక్స్‌ అయినట్టు తెలిసింది. దీంతో జిల్లా నేతలకు రెండు కీలక పదవులు దక్కనున్నారు. కాంగ్రెస్‌కు జిల్లాలో పూర్వవైభవం రానుంది.

You missed