రాష్ట్రం అంతా ఒక్కటి నడిస్తే ఆర్మూర్‌లో మరొకటి నడుస్తోంది. మొన్నటి వరకు అక్కడ జీవన్‌ రెడ్డి మోనార్క్‌. మోనోపాలి. అక్క, అన్న పేరు చెప్పి అందరినీ భయపెట్టి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాడు. మధ్యలో పెద్దవాళ్ల పేర్లూ బద్నాం చేశాడు. ఇప్పుడు సీన్‌ మారింది. ఆర్మూర్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రాకేశ్‌రెడ్డి గెలిచాడు. గెలిచిన మరునాటి నుంచే జీవన్‌రెడ్డిపై పడ్డాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌ కిమ్మనకుండా ఉంటే.. రాకేశ్‌ మాత్రం రాకెట్ స్పీడ్‌లో జీవన్‌పై ఉక్కుబాణం వదులుతున్నాడు. ఆర్టీసీ మాల్‌ బకాయిల నుంచి మొదలుకొని, దానికి కరెంటు బకాయిలు, మాక్లూర్‌ అక్రమ మొరం దందా.. తనను చంపుతాననే బెదిరింఉ కాల్స్‌ .. ఇవన్నీ ఇప్పుడు బహిరంగంగా బయటపెట్టి తాడోపేడో తేల్చుకుందాం రా అని తొడలు చరుస్తున్నాడు రాకేశ్.

ఏకంగా మాక్లూర్‌లో ఇన్నేళ్లు జరిగింది రెండు మూడు వేల కోట్ల పెద్ద స్కాం అని దీన్ని సీబీఐ తో ఎంక్వైరీ చేయించాలని కూడా కేంద్రాన్ని కోరాడు రాకేశ్‌. కేజీఎఫ్‌ సినిమాలో బంగారు గనుల కోసం తవ్విపడిసినట్టుగా.. మాక్లూర్‌ గుట్టలన్నీ మొరానికి, క్రషర్లకు బలైపోయాయాని, ఆనవాళ్లు లేకుండా చేశారని, జిల్లా కలెక్టర్‌, సీపీలకు ఫిర్యాదు చేశాడు రాకేశ్‌. తనను చంపుతానని జీవన్‌రెడ్డి, అతని అనుచరులు బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదు చేయడంతో రాకేశ్‌కు భద్రతను పెంచారు. ఢిల్లీ నుంచి సంజయ్‌ రాకేశ్‌కు ఫోన్‌ చేసి తన సంఘీభావం తెలిపాడు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడ్డ భయపడేది లేదని ముందుకు సాగాలని భరోసా నిచ్చాడు. మరోవైపు మాక్లూర్‌లో సర్వే మొదలైంది. ఇప్పటి వరకు అక్రమంగా ఎంత మొరం తరలించారో లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు మైనింగ్‌ అధికారులు.

You missed