వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైదరాబాద్‌:

ఇంటికో ఉద్యోగం ఉద్య‌మ‌కాలం నాడు సెంటిమెంట్ రాజేసే య‌త్నం. అధికారంలోకి వ‌చ్చినంక‌.. అదెలా సాధ్యం.. అస‌లు స‌ర్కార్ కొలువులు అంత వీజీనా..? ప్రైవేటు సెక్టారే బెట‌ర్‌. పెట్టుబ‌డులు పెట్టండ‌ని.. దారి మ‌ళ్లించి.. త‌ప్పుదారి ప‌ట్టించిన తండ్రీకొడుకులు. కానీ ఇప్పుడు సుద్ద‌పూస‌లా సూక్తులు చెబుతున్నారు. ఏవీ స‌ర్కార్ ఉద్యోగాల‌ని అడుగుతున్నారు? జాబ్ క్యాలెండ‌ర్ ఎక్క‌డ‌..? అని కూడా ఉద్యోగార్థుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. ఇంత‌క‌న్నా విచిత్ర‌మైన‌.. హాస్యాస్ప‌ద‌మైన విష‌యం ఒక‌టి మాట్లాడిండు.. కేటీఆర్. ఏమ‌ని? రా… ఉద్యోగాలు, నియామ‌కాల‌పై ప్ర‌త్యేక అసెంబ్లీ పెట్టు.. రెండ్రోజులు చ‌ర్చిద్దామ‌న్నాడు. మాట‌న‌డానికి సిగ్గుండాలె.

ప‌దేండ్ల పాల‌న ఏడ? రెండేండ్లు కూడా నిండ‌ని స‌ర్కార్ ఏడ‌..? అప్పుడే అంత తొంద‌రెందుకు? చెప్పేవి నీతులు.. మ‌రి అప్పుడు మ‌రి చేసిన తతంగాలేమిటీ? అవి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు మ‌రిచిపోయార‌నుకుంటున్నావా కేటీఆర్‌?

స్వ‌యంగా త‌నే ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యం ఒక‌టి వైర‌ల్ అవుతోంది ఈ సంద‌ర్భంగా. అంద‌రికీ స‌ర్కార్ కొలువులు సాధ్యం కాదు. ప్రైవేటులో ఉద్యోగాల కోసం ట్రై చేయండి. పెట్టుబ‌డులు పెట్టండి. అని యువ‌త‌కు పిలుపినిచ్చాడు ఇదే కేటీఆర్‌. మ‌రి ఆనాడేమైంది.. మీ స‌ర్కార్ ఉద్యోగాల విజ‌న్‌.

కేసీఆర్ ఏం త‌ప్పు చేశాడో.. ఆ పాల‌న‌లో ఎక్క‌డ పొర‌పాట్లు జ‌రిగాయో… ఎవ‌రెవ‌రి ప‌ట్ల వివ‌క్షాపూరితంగా వ్య‌వ‌హ‌రించి ఓట‌మిని చేర‌దీసుకుని ఫామ్‌హౌజ్ పాల‌య్యాడో.. అన్నీ తెలుసు. అంద‌రికీ. అవే జ‌ర‌గ‌కుండా చూసుకుంట‌న్న‌ది ఇప్ప‌టి స‌ర్కార్‌. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. ప్ర‌తీదానికి అడ్డంకి వేసి.. జ‌నం ముందు మేమే హీరోలం.. ప్ర‌స్తుత స‌ర్కార్ ఓ విల‌న్ అని చెప్పే య‌త్నం కేటీఆర్ చేస్తున్నా.. అది జ‌నామోదం పొంద‌డం లేదు. ఎందుకంటే.. ప‌దేండ్లు పాలించింది మీరే క‌దా వ‌యా..! ఈ వ‌య్యా ఎందుక‌న్నానంటే.. రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న‌గారు ఇచ్చిన గౌర‌వం ఇదేమ‌రి. త‌న‌కు తాను పెద్ద‌గా ఊహించుకుంటున్నాడు. ఇంకా షాడో సీఎంనే అనుకుంటున్నాడు.

నోటికేదొస్తే అది.. నాలుక మ‌డ‌తెడుతున్నాడు. మాట్లాడిన మాట‌ల‌కు పొంత‌న లేదు. సోయి త‌ప్పి .. అధికారం పోయింద‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో అప‌రిచితుడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు కేటీఆర్‌. కానీ యువ‌త మాత్రం అత‌గాడిని, అత‌ని గ‌త స్మృతుల‌ను, పాల‌నా ప‌ర లోపాలు, శాపాల‌ను ఇంకా మ‌రిచిపోలేదు. ఆ గాయాలు ఇంకా మాన‌లేదు. అది గుర్తెర‌గ‌డం లేదు మ‌న రామ‌న్న‌.